check : ఆన్ లైన్ పేమెంట్లు వచ్చిన దగ్గర నుంచి బ్యాంకుకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ అయింది. అప్పుడు 100 మంది వెళ్తే ఇప్పుడు ఓ 30 మంది వెళ్తున్నారు కావచ్చు. రోజు బ్యాంకుల్లో క్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఇలా వెళ్లి వర్క్ చేసుకొని అలా వచ్చేయచ్చు. మరి సులభమే కదా. అయితే బ్యాంకుకు వెళ్లాక ఈ స్లిప్స్ రాయడం పెద్ద తలకాయ నొప్పి కదా. అవి రాయడం రావాలి. లేదంటే పక్కన వారిని అడగాలి. కాస్త మిస్టక్ అయినా కూడా తేడాలు వచ్చేస్తాయి. అయితే మీరు చెక్ లను ఉపయోగిస్తారా? అవును చాలా మంది వినియోగిస్తున్నారు కదా. మరి వీటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం.
బ్యాంక్ చెక్కు ద్వారా చెల్లింపు చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి. చాలా మందికి వీటి గురించి పూర్తి విషయాలు తెలియదు. బ్యాంకు చెల్లింపు చేయడానికి కొన్ని సార్లు ఈ రీజన్ ల వల్లనే నిరాకరిస్తుంటుంది. అయితే చెక్కులపై సంతకాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవాలి. అందుకే ముందుగా చెక్కులపై పదాలలో ఉన్న కొన్నింటి అర్థం కూడా తెలుసుకోవాలి. మరి చెక్కుపై మొత్తం సంఖ్యలతో పాటు పదాలలో రాయడం కామన్ గా చూస్తాం. దీని అర్థం మీకు తెలుసా?
చెక్కుపై పదాలతో మొత్తాన్ని రాసిన తర్వాత ‘రూపాయిలు మాత్రమే’ అని రాస్తారు. అదే ఇంగ్లీష్‌లో అయితే ఓన్లీ (Repees Only) అని రాయడం ప్రతి సారి రిపీట్ గానే ఉంటుంది. ఈ పదాలు మాత్రం అసలు మారవు. అయితే, కొందరు మాత్రం డబ్బును అంకెల్లో రాస్తారు. కానీ అక్షరాల్లో రాయడం మాత్రం మర్చిపోతుంటారు. మరి ఇలా చెక్కుపై రూపాయలు మాత్రమే అని ఎందుకు రాస్తారో మీకు తెలుసా?
“రూపాయలు” తర్వాత మాత్రమే అని రాయాలి. ఎందుకంటే చెక్ ట్యాంపరింగ్ నిరోధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మొత్తం లేకుండా కేవలం “రూ” అని రాస్తే చెల్లించాల్సిన మొత్తాన్ని ఇతరులు పెంచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీరు రాసిన దానికంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవద్దు అంటే ఇలా రాయాలి. వారికి అంకెల్లో లేదా పదాలను జోడించే అవకాశం లేకుండా ఇలా రాయాలి.
చెక్‌పై మొత్తాన్ని అంకెల్లోనే కాకుండా అక్షరాలలో కూడా రాయాలి. అంకెల తర్వాత చివర పదాలతో రాయడం వలన ఎవరైనా చెక్కును మార్చడం, పెద్ద మొత్తాన్ని క్లెయిమ్ చేయడం వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇక కరెన్సీని “రూపాయిలు మాత్రమే” అని రాయడం వలన ఉద్దేశించిన మొత్తం గురించి ఎటువంటి ఇబ్బంది, గందరగోళం వంటి సమస్యలు రావు. అందుకే ఈ చెక్కుల విషయంలో మోసానికి గురి కాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఇది ఒక ప్రామాణిక విధానాన్ని పెట్టారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎక్కువగా అవడం వల్ల చెక్కుల ద్వారా లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పాలి. కానీ, చెక్ ఇస్తే మాత్రం దానికి సంబంధించిన నియమాలను తెలుసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అందుకే మీరు మొత్తాన్ని అంకెలను వేసిన తర్వాత కూడా ఆ మొత్తాన్ని అక్షరాలలో రాయండి. అక్షరాలలో చివరగా రూపాయలు మాత్రమేనని రాయడం కూడా మర్చిపోవద్దు.