Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకుడు గంటా శ్రీనివాసరావు. బలమైన కాపు సామాజివర్గ నాయకుడు. ఎక్కడ ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా భారీ అనుచరవర్గం..అంగ బలం ఆయన సొంతం. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో జంప్ అయినప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక వింగ్ ను తన వెంట తీసుకెళ్లడం పరిపాటి. 2009 ప్రజారాజ్యం ఆవిర్భావంతో చిరంజీవి వెంట నడిచిన ఆయన తనతో పాటు భారీగా నాయక గణాన్ని తీసుకెళ్లారు. అందులో తన కాపు సామాజికవర్గ నేతలే అధికం. తనతో పాటు తాను తీసుకెళ్లిన నాయకులను నాడు ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు సైతం అమాత్య పదవి దక్కించుకున్నారు. తాను నడిచే ప్రతీసారి విజయం వైపే ఆయన అడుగులు వేశారు. సక్సెస్ అయ్యారు.
కానీ 2019లో మాత్రం తన అంచనా తప్పింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే పదవికే పరిమితమయ్యారు. తొలినాళ్లో వైసీపీలోకి వెళతారని ప్రచారం సాగినా.. తన అధికారానికి అడ్డు వస్తారేమోనని ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగింది. కానీ తనకున్న వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని రాజకీయంగా గత మూడేళ్లుగా గంటా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండీ తెరపైకి వస్తున్నారు. అయితే ఆ ధైర్యం వెనుక సొంత పార్టీ టీడీపీ ఉందంటే పొరబడినట్టే. ఆయనిప్పుడు జనసేన బూచీ చూపి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. ఈ మాట నిజమే. చిరంజీవి కుటుంబంతో గంటా శ్రీనివాసరావుకు మంచి సంబంధాలే ఉన్నాయి. అటు పవన్ తో కొన్నేళ్ల పాటు ట్రావెల్ చేసిన గంటా కాపు సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచే సన్నాహాలు ప్రారంభించారు.
Also Read: US Presidential Building: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం సెక్యూరిటీ ఏ లెవల్ లో ఉంటుందో తెలుసా?
ఇంట గెలిచి రచ్చ గెలవాలని గంటా భావిస్తున్నారు. తన పాత ‘కాపు’లను, అనుచరులను ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయిన తన సన్నిహితుడు, అనుచరుడు అవంతి శ్రీనివాసరావుకు సంఘీభావం తెలిపేలా వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పాలనా రాజధాని ప్రకటించారు. కానీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా అవంతిని తన వైపు తిప్పుకునేలా చేశారు. పక్క జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ సమీక్షకు హాజరుకాకపోవడాన్ని ప్రస్తావించారు. ఇష్టం లేని శాఖను అప్పగించి బొత్సను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని చెప్పడం ద్వారా భవిష్యత్ లో బొత్స ద్వారా ప్రభుత్వానికి అసమ్మతి తప్పదని హెచ్చరికలు జారీచేశారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనాన్ని బొత్స సత్యనారాయణ సహించలేకపోతున్నారు. మొన్న బండ్ల గణేష్ కు ఎంపీ విజయసాయిరెడ్డిల ట్విట్ల యుద్ధం వెనుక బొత్స సైతం ఉన్నారని టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో బొత్స పేరును గంటా నోట రావడం ఉత్తరాంధ్రలో ఏదో జరుగుతుందన్న అనుమానం నెలకొంది. గంటా భారీ స్కెచ్ ద్వరా తన మంత్రాంగాన్ని నడుపుతున్నారన్న చర్చలు ప్రారంభమయ్యాయి. కాపు నాయకులకు ఒకే తాటిపైకీ తీసుకురావడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గట్టిగా కొట్టాలని ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది టీడీపీలోనా.. లేకుంటే జనసేనలోనా.. లేకుంటే రెండు పార్టీల పొత్తు ద్వారానైనా తాను అనుకున్నది సాధించాలని గంటా ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: Krishna Vrinda Vihari: “కృష్ణ వ్రింద విహారి” రాక అప్పుడే.. హిట్ కొడతాడా ?