Homeఆంధ్రప్రదేశ్‌Gaddar Letter: గద్దర్ చివరి లేఖ.. అందులో ఏం రాశాడో తెలుసా?

Gaddar Letter: గద్దర్ చివరి లేఖ.. అందులో ఏం రాశాడో తెలుసా?

Gaddar Letter: ఉద్యమ స్వరం మూగబోయింది. కాళ్లకు గజ్జ కట్టి ఆడిన యుద్ధనౌక విశ్రాంతి తీసుకుంది. ఆ తెలంగాణ వాగ్గేయకారుడికి సమాజం కన్నీటి నివాళులర్పించింది. ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ, ఒక రూట్ మ్యాప్ అనేది రూపొందించకపోయినప్పటికీ గంటలపాటు ఆయన పార్థివ దేహం మోసుకెళ్తున్న వాహనం వెంట అడుగులు వేసింది. మహా బోధి స్కూల్లో ఆయన శరీరానికి చివరి వీడ్కోలు పలికి వచ్చింది. సరే గద్దర్ ఒక జ్ఞాపకం అయిపోయాడు. వాస్తవానికి గద్దర్ అంతరంగం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. అంపశయ్యపై ఉన్నప్పుడు గద్దర్ ఏం చేశాడు? కోలుకొని వస్తే ఏం చేయాలనుకున్నాడు? తన లేఖలో ఏం రాశాడు?

గుండె సంబంధిత సమస్యతో అపోలో ఆసుపత్రిలో గద్దర్ చేరాడు. జూలై 31న తెలంగాణ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖలో త్వరలోనే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తానని చెప్పాడు. కానీ ఆయన మరలి రాణి లోకాలకు వెళ్లిపోయాడు. తిరిగి వస్తానని మాట కూడా ఇచ్చావు గద్దర్ అన్నా అంటూ ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రిలో చేరిన గద్దర్ కు గుండె ఆపరేషన్ విజయవంతంగా జరిగినప్పటికీ.. గతంలో ఆయనకు ఉన్న ఊపిరితిత్తుల సమస్య కారణంగా తిరిగి కోలుకోలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశారు. జూలై 31న తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన లేక ప్రస్తుతం వైరల్ గా మారింది.

” నా పేరు గుమ్మడి విఠల్. నా పాట పేరు గద్దర్, నా బతుకు సుదీర్ఘ పోరాటం, నా వయసు 76 సంవత్సరాలు. నా వెన్నెముకలో ఉన్న బుల్లెట్ వయసు 25 సంవత్సరాలు. ఇటీవల సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నాను. గుండె సంబంధిత చికిత్స కోసం అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చేరాను. జూలై 20 నుంచి ఈరోజు వరకు పరీక్షలు మొత్తం చేయించుకుని, చికిత్స పొందుతున్నాను. కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మీ వద్దకు వస్తాను. సాంస్కృతిక ఉద్యమాన్ని తిరిగి మొదలుపెట్టి ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను” అని లేఖలో రాశారు. కానీ ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూసి, అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ లేఖను తలచుకొని ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version