https://oktelugu.com/

Beggar Become Doctor : మురికివాడలో యాచించిన ఆమె.. ఇప్పుడు MBBS వైద్యురాలు.. ఆసక్తికర సక్సెస్ స్టోరీ..

అయితే కొన్ని పరిస్థితుల్లో ఆమెకు డబ్బు లేకపోవడంతో ప్రముఖ కాలేజీల్లో సీటు రాలేదు. కానీ పట్టుదలతో చదువుతూ ముందుకు వెళ్లిన ఆమె చైనాలోని ప్రతిష్టాత్మక కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. యాచకురాలిగా ఉన్న తాను కాలేజీలో చదువతానని అనుకోవడం లేదంటూ బావోద్వేగానికి గురవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ స్టోరీ ఏంటీ?

Written By:
  • Srinivas
  • , Updated On : October 4, 2024 4:14 pm
    Beggar Become Doctor

    Beggar Become Doctor

    Follow us on

    Beggar Become Doctor : ‘ఆయన పుట్టగానే బంగారు చెంచా నోట్లు పెట్టుకున్నడు’ అని కొందరు అంటుంటారు. అంటే ధనవంతుల ఇళ్లల్లో పుట్టిన కొందరి గురించి చెబుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇలా జన్మించిన వారి జీవితానికి ఎటువంటి డోకా ఉండదు. వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. జీవితంలో వారు ఏది సాధించాలన్న తల్లిదండ్రుల సాయం ఉంటుంది. కానీ కొందరి జీవితం పూల పాన్పు కాదు. ఇళ్లల్లోనో, ఆసుపత్రుల్లోనో కాదు.. చెత్త కుప్పల్లో పుట్టిన వారున్నారు. ఇటువంటి వారు యాచిస్తే గాని జీవితం గడవని స్థితిలో ఉంటారు. ఇలాంటి వారు కడుపు నింపుకోవడం కోసం చిన్న చిన్న పనుల చేయడం తప్ప ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని అనుకోరు. కానీ ఓ అమ్మాయి చిన్నప్పుడు చిత్తు కాగితాలు ఏరుతూ బతికేది. బిచ్చమత్తుకుంటూ బతికేది. ఈమెను చూసి చలించిన ఓ బౌద్ధ భిక్షువు చేరదీశాడు. ఆమెకు చదువు చెప్పించాడు. ఉన్నత చదువులకు సాయం చేశాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఆమెకు డబ్బు లేకపోవడంతో ప్రముఖ కాలేజీల్లో సీటు రాలేదు. కానీ పట్టుదలతో చదువుతూ ముందుకు వెళ్లిన ఆమె చైనాలోని ప్రతిష్టాత్మక కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. యాచకురాలిగా ఉన్న తాను కాలేజీలో చదువతానని అనుకోవడం లేదంటూ బావోద్వేగానికి గురవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ స్టోరీ ఏంటీ?

    చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు.. అని పుస్తకాల్లో చదివాం. కానీ నేటి కాలంలో ఉన్న పరిస్థితుల్లో సామాన్యులు సామాన్యులుగానే ఉండిపోతున్నారు. ప్రపంచంలో పోటీ ఏర్పడడంతో ఉన్నత స్థాయిలో కొందరు మాత్రమే రాణిస్తున్నారు. అందులోనూ పేదవారు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పింకీ చైనాలోని మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

    పింకీ షిమ్లాలోని మురికివాడలో జన్మించింది. యాచిస్తే గానీ పూటగడవని కుటుంబం అది. అందువల్ల తల్లిదండ్రులతో కలిసి ఆమె ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకూ జీవించేంది. 2004లో బాల్య దశలో ఉన్న పింకీని టిబిటన్ శరణార్థ సన్యాసి లాబ్ సంగ్ జామ్ యాంగ్ చూశాడు. ఆమెను చూసి చలించిపోయాడు. ఆమెకు చదువు చెప్పించాలని అనుకున్నాడు. దీంతో ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆ బాలికను ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్ లో చేర్పించాడు.

    అయితే పింకీ మొదటి నుంచి చదువులో రాణిస్తూ ఉండేది. అలా మొత్తానికి నీట్ లోనూ ఉత్తీర్ణురాలైంది. అయితే సరైన ర్యాంకు రాని కారణంగా ప్రైవేట్ కళాశాలలో చేరేందుకు అవకాశం రాలేదు. అంతేకాకుండా డబ్బు కూడా లేకపోవడంతో ఆమె చదువుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ బ్రిటన్ కు చెందిన టాంగ్ -లెన్ చారిటబుల్ ట్రస్ట్ సాయంతో చైనాలోని ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలలో సీటు దక్కించుకుంది. ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన పింకీ ఇటీవలే ధర్మశాలకు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మురికి వాడలు నాకు జీవితాన్ని నేర్పాయి..’ అని తెలిపింది. ఈ సందర్భంగా ఆమెను బౌద్ధ భిక్షులు అభినందించారు.