Brahmacharini Devi on the second day: దేశవ్యాప్తంగా నవరాత్రులు అక్టోబర్ 3 గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ అక్టోబరు 12న ముగిస్తుంది. అయితే నవరాత్రుల్లో దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో అవతారంతో పూజిస్తారు. హిందువులు భక్తితో తొమ్మిది అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది ఆదిశక్తి రూపాలను నవదుర్గాలు అంటారు. అవే శ్రీ శైలపుత్రి, శ్రీ బ్రహ్మచారిణి, శ్రీ చంద్రఘంట, శ్రీ కూష్మాండ, శ్రీ స్కందమాత, శ్రీ కాత్యాయని, శ్రీ కాళరాత్రి, శ్రీ మహాగౌరి, శ్రీ సిద్ధిదాత్రిగా పిలుస్తారు. అయితే నవరాత్రుల సందర్భరంగా రెండో రోజు దుర్గాదేవిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఈమె గొప్ప సతీదేవి. ఈరోజు భక్తులు ఆమె అవివాహిత రూపాన్ని పూజిస్తారు. బ్రహ్మచారిణిగా ఆమె చెప్పులు లేకుండా నడుస్తూ.. రెండు చేతులతో దర్శనిమిస్తుంది. కుడి చేతిలో జప్ మాల, ఎడమ చేతిలో కమండల్ ధరించి ఈరోజు భక్తులకు దర్శనమిస్తుంది.
కూష్మాండ రూపం తర్వాత పార్వతీ దేవి దక్ష ప్రజాపతి ఇంటిలో జన్మించిందని. బ్రహ్మచారిణి దేవి పరమశివుడిని భర్తగా పొందాలని తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో 1,000 సంవత్సరాలు పువ్వులు, పండ్ల ఆహారం, మరో 100 సంవత్సరాలు నేలపై నిద్రిస్తున్నప్పుడు ఆకు కూరలతో గడిపిందని పురాణలు చెబుతున్నాయి. అయితే ఆమె 3,000 సంవత్సరాల పాటు బిల్వ ఆకులను ఆహారంగా పరమశివుడుని ప్రార్థించింది. కానీ ఆ తర్వాత ఆమె ఆకులు తినడం మానేసి.. ఎలాంటి ఆహారం, నీరు లేకుండా జీవించిందని పురాణలు చెబుతున్నాయి.
ఈరోజు బ్రహ్మచారిణి దేవీని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఆమెను పూజించడం వల్ల వైరాగ్యం, అనారోగ్య సమస్యలు, బాధల నుంచి బయటపడవచ్చని చెబుతారు. అలాగే ప్రవర్తన కూడా మెరుగు పడుతుందని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల్లో రెండో రోజు బ్రహ్మచారిణి దేవీని పూజిస్తారు. అక్టోబర్ 4న ఉదయం 5:30 నుంచి అక్టోబర్ 5 ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:38 నిమిషాల నుంచి 5:27 వరకు ఉంది. అయితే ఈ రోజు భక్తులు దేవీని పూజించేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల అనుకొన్నవి జరుగుతాయని, మంచి ఫలితాలు లభిస్తాయని, సంతానోత్పత్తి, శాంతి ఉండటంతో పాటు జీవితంలో ప్రశాంతత వస్తుందని నమ్ముతారు.
పూజా విధానం ఎలా చేయాలంటే?
నవరాత్రుల్లో రెండవ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. తలస్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి, ఇంటిని శుభ్రం చేసిన తర్వాత దుర్గాదేవిని పూజించాలి. అలాగే పూజ గదిలో ఒక కలశం ఏర్పాటు చేసి బ్రహ్మచారిణికి మల్లెపువ్వులు, బియ్యం, చందనం, కుంకుమ సమర్పించాలి. అమ్మవారి విగ్రహానికి స్నానం చేసిన తర్వాత ఇవన్ని సమర్పించాలి. దుర్గాదేవికి పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి పంచదార చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.