Nagarjuna: నాగార్జున ను టార్గెట్ చేసింది ఎవరు..? ఆయనకి ప్రతి విషయం లో ఇబ్బంది ఎదురవుతుందా..?

సినిమా అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో విడదీయరాని బంధం అయిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు సినిమాలను ఎక్కువగా చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్న సంతోషంతో ఉన్న సినిమా చూస్తేనే వాళ్ళు కొంత రిలాక్స్ అవుతారని ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు. కాబట్టి వాళ్లందరి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 4, 2024 5:00 pm

Nagarjuna(9)

Follow us on

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉంది.అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు తరుచుగా వివాదాలు చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక రీసెంట్ గా నాగార్జున చాలా ఇష్టంగా కట్టించుకున్న ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టారు. అప్పుడు వార్తల్లో నిలిచిన నాగార్జున, ఇక రీసెట్ గా కాంగ్రెస్ పార్టీ మంత్రి అయిన కొండా సురేఖ చేసిన వాక్యలతో మరోసారి అక్కినేని ఫ్యామిలీ మ్యాటర్ తెరపైకి వచ్చింది. మరి ఎందుకు అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేసి రాజకీయ నాయకులు ఇలాంటి ఒక ఎత్తుగడలు వేస్తున్నారు. అనేది కూడా ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. నిజానికి అయితే నాగార్జున ఏ పార్టీలో చేరిన సంఘటనలు అయితే లేవు. ఇక నాగేశ్వర రావు కూడా రాజకీయంగా ఎప్పుడు ముందుకు రాలేదు. ఇక సీనియర్ ఎన్టీఆర్ సైతం తన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆహ్వానం అందించినప్పటికి నాగేశ్వరరావు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పి సున్నితంగా ఆ ఛాన్స్ ను తిరస్కరించాడు. ఇక ఇప్పుడు నాగార్జున మీద పెరుగుతున్న ఒత్తిడిని బట్టి చూస్తే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనను కావాలనే టార్గెట్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి కొంచెం ఫేవర్ గా కనిపించాడు.

ముఖ్యంగా కేటీఆర్ కి చాలా సన్నిహితంగా ఉండేవాడు. అందువల్లే నాగార్జున మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో నాగార్జునకి ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందు ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనప్పటికి నాగార్జున మాత్రం సులువుగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రాజకీయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించే నాగార్జున…రాజకీయ పార్టీలకు సంబంధించిన క్వశ్చన్స్ ను అడిగిన కూడా చాలా సున్నితంగా సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా మనకు ఎక్కడా కనిపించదు అన్ని పార్టీలను సమానంగా చూసినట్టుగానే కనిపిస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలో నాగార్జునను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక వీటితో ఆగిపోతుందా లేదా ముందు ముందు మరికొన్ని నాగార్జున చేసిన కథనాలను ముందుకు తీసుకొస్తారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…