Free Aadhaar update till June 14 : అయితే ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డును 10 ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్డేట్ చేసుకోవడం వలన ఆధార్ కార్డులో ఉన్న సమాచారం ఇతర విలువైన డాక్యుమెంట్లలో ఉన్న సమాచారం రెండూ ఒకే విధంగా సరైనవిగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పాత ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికోసం జూన్ 14, 2025 వరకు గడువుగా నిర్ణయించింది. ప్రస్తుతం మీ ఆధార్ కార్డులో ఉన్న ఏదైనా సమాచారాన్ని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటున్నాట్లయితే మీకు జూన్ 14 వరకు మాత్రమే సమయం ఉంది. యు ఐ డి ఏ ఐ 10 ఏళ్ల తర్వాత పాత ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకు సమయాన్ని కేటాయించింది. జూన్ 14, 2025 వరకు మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
అయితే గడువు పూర్తయిన తర్వాత మీరు ఈ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి రుసుము చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన కార్డు. కేవలం ప్రభుత్వ పథకాల కోసం మాత్రమే కాకుండా ఆధార్ కార్డు బ్యాంకింగ్, పాన్ కార్డు లింక్, స్కూల్, కాలేజీ అడ్మిషన్లు ఇలా ప్రతి ఒక్క పనికి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో మీకు అవి చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మీరు మీ ఇంటి నుంచే ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని మార్చుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డుకు సంబంధించిన మరికొన్ని సేవలను అందుకోవడానికి మీరు మీకు దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఇంటి నుంచి కూడా మీరు మీ సమాచారాన్ని ఆన్లైన్లో ఆధార్ అధికారికా వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ ఆధార్ నెంబర్ తో పాటు డాక్యుమెంట్ అప్డేట్ ఎంపికను కూడా ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అలాగే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. ఓటిపి ద్వారా లాగిన్ అయిన తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్ను ఎంపిక చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేసి సమర్పించాలి. చివరలో మీరు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ పొందుతారు. దీని ద్వారా మీరు మీ ఆధార్ కార్డు అప్డేట్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు.
Also Read : ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డ్‌లో ఫోటో ఎందుకు తరచుగా చెడిపోతుంది? సమాధానం తెలుసుకోండి