దేశంలో మొదటిసారి.. ఒకే వ్యక్తిలో రెండు వేరియంట్లు..

రెండు సంత్సరాలుగా ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా ఇంకా పూర్తిగా తొలిగినట్లు కనిపించడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నా.. వైరస్ విస్తరణను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. రోజురోజుకు వైరస్ లో మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్, సెకండ్ వేవ్లతో అట్టుడుకిన ప్రపంచం థర్డ్ వేవ్ ఎప్పుడు ముంచుకొస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంతో కొన్ని కొత్త వేరియంట్లు బయటపడడం భయాందోళన వ్యక్తమవుతోంది. తాజాగా దేశంలో ఓ వ్యక్తిలో ఒకటి కాకుండా […]

Written By: NARESH, Updated On : July 21, 2021 8:00 am
Follow us on

రెండు సంత్సరాలుగా ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా ఇంకా పూర్తిగా తొలిగినట్లు కనిపించడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నా.. వైరస్ విస్తరణను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. రోజురోజుకు వైరస్ లో మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్, సెకండ్ వేవ్లతో అట్టుడుకిన ప్రపంచం థర్డ్ వేవ్ ఎప్పుడు ముంచుకొస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంతో కొన్ని కొత్త వేరియంట్లు బయటపడడం భయాందోళన వ్యక్తమవుతోంది. తాజాగా దేశంలో ఓ వ్యక్తిలో ఒకటి కాకుండా రెండు వేరియంట్లు బయటపడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మాములుగా ఒక వేరియంట్ కే ప్రాణాల మీద ఆశ ఉండడం లేదు. అలాంటిది ఓ వ్యక్తి శరీరంలో రెండు వేరియంట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అసోంలోని ఓ వైద్యురాలి శరీరంలో అల్ఫా, బీటా అనే రెండు వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అయితే దీనిపై స్ఫష్టత కోసం మరోసారి పరీక్షించారు. రెండో సారి కూడా రెండు వేరియంట్లు ఉన్నట్లు రిజల్ట్స్ వచ్చాయి. మొదట వైద్యరాలి భర్తకు కరోనా సోకింది… ఆ తరువాత ఆమెను పరీక్షించగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది.

అయితే ఆమె రెండు వేరియంట్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. కాగా ఆ వైద్యురాలు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నారు. అయినా ఒకేసారి రెండు వేరియంట్లు ప్రవేశించడంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఇలా డబుల్ వేరియంట్లు కలిగిన వ్యక్తి బ్రెజిల్ దేశంలో బయటపడింది. 90 ఏళ్ల వృద్ధురాలైన ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో రిపోర్టులో అల్పా, బీటా వేరియంట్లు ఉన్నట్లు తేలింది. అయితే ఆమె వ్యాక్సిన్ వేసుకోలేదు. దీంతో ఆరోగ్యం క్షిణించి మరణించింది.

కానీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా వేరియంట్ల నుంచి తప్పించుకోలేమా..? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అయతే ఇలా డబుల్ వేరియంట్లు బయటపడలేదు. ఒకవేళ రాను రాను డబుల్ వేరియంట్లు గుర్తిస్తే ప్రమాదమేనంటున్నారు వైద్య నిపుణులు. ఓ వైపు వ్యాక్సినేషన్ జోరుగా సాగడంతో కాస్త ఉపశమనం అనుకుంటున్న తరుణంలో ఇలా వ్యాక్సిన్ తీసుకున్న వారికి పాజిటివ్ రావడం మరోవైపు ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.