‘రాజ్ కుంద్రా’ కథలు మాములుగా లేవుగా..!

ఫొర్న్ వీడియోల చిత్రీకరణ ప్రకంపనలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు మారుమోగుతోంది. ఇటీవల ఆయనను ముంబై పోలీసులు అరెస్టు చేసిన తరువాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన గురించి తెలియగానే ఆస్తుల విషయంలో సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన ఆస్తి కోట్లల్లో ఉందని తేలింది. ఈ సంపాదనకు మార్గం గురించి ఆరా తీయగా ఆయన ఫోర్న్ వీడియోల చిత్రీకరణతోనేనని పోలీసుల విచారణలో తేలుతోంది. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా పెద్ద రాకెట్ నడిపారని, ఇందులో […]

Written By: NARESH, Updated On : July 21, 2021 10:29 am
Follow us on

ఫొర్న్ వీడియోల చిత్రీకరణ ప్రకంపనలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు మారుమోగుతోంది. ఇటీవల ఆయనను ముంబై పోలీసులు అరెస్టు చేసిన తరువాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన గురించి తెలియగానే ఆస్తుల విషయంలో సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన ఆస్తి కోట్లల్లో ఉందని తేలింది. ఈ సంపాదనకు మార్గం గురించి ఆరా తీయగా ఆయన ఫోర్న్ వీడియోల చిత్రీకరణతోనేనని పోలీసుల విచారణలో తేలుతోంది. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా పెద్ద రాకెట్ నడిపారని, ఇందులో నలుగులు వ్యక్తులతో కూడిన ఓ ముఠా ఉందని తెలిపారు.

‘హెచ్’ అనే పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫోర్న్ వీడియోల మార్కెటింగ్ కోసం దానిని ఉపయోగించుకునేవారు. దీనీనీ పోలీసులు మీడియాకు లీక్ చేశారు. తన పోర్న్ వీడియోల మార్కెటింగ్ కోసం సొంతంగా హాట్ షాట్స్ అనే యాప్ నుకూడా క్రియేట్ చేశారు. దాని ఆధారంగానే వ్యాపారాన్ని నిర్వహించేవారు. ఈ యాప్స్ లో అత్యధిక వ్యూస్ వచ్చేలా మార్కెట్ చేయడం, దాని ద్వారా డబ్బు సంపాదించేవాడు. అయితే ఇవన్నీ రాజ్ కుంద్రా స్వయంగా పర్యవేక్షించేవారని పోలీసులు తెలిపారు.

సినిమాల్లో అవకాశాల కోసం వచ్చేవారిని రాజ్ కుంద్ర వెబ్ సీరిసుల్లో అవకాశాలిప్పిస్తానని ఫోర్న్ వీడియోలు చిత్రీకరించేవారు. వివియాన్ పేరుతో ఉన్న కంపెనీ తరుపునే ఈ లావాదేవీలు నిర్వహించేవారు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో విదేశీ మారక ద్రవ్యాలు లభించాయి. అయితే వివియాన్ కంపెనీ స్థాపన, ఫోర్న్ వీడియోల చిత్రీకరణ ఎలా తీశారనేదానిపై పోలీసులు ఇంకా లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఇక ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టి పేరు మారుమోగుతోంది. వాస్తవానికి ఆమె ప్రమోయం లేకున్నా ఆమె ద్వారానే రాజ్ కుంద్రా అందరికీ తెలుసు. ఆయన పేరు వాడే ప్రతీ సారీ శిల్పశెట్టి భర్త అనడంతో రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టి కూడా వార్తల్లో నిలిచినట్లయింది. అయితే రాజ్ కుంద్రాతో పాటు ఈ తతంగంలో బాలీవుడ్లో మరికొంత మంది ప్రముఖులున్నారని, వారి పేర్లు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాజ్ కుంద్రా విషయంలో స్పష్టమైన సాక్ష్యాలు లభించడంతో ఆయనను అరెస్టు చేశారు.