కేంద్రం గుడ్ న్యూస్: పిల్లలకు టీకాలు

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న వేళ ఉపశమనం కలిగించే వార్తను అందించింది. కరోనాపై పోరులో కీలకంగా మారిన వ్యాక్సిన్లపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్నారులకు టీకాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. దేశంలో చిన్నారుల కోసం ప్రస్తుతం నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు మరోకటి వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ దశలో ఉందని తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా విజ్ఞాన, […]

Written By: NARESH, Updated On : July 21, 2021 9:52 am
Follow us on

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న వేళ ఉపశమనం కలిగించే వార్తను అందించింది. కరోనాపై పోరులో కీలకంగా మారిన వ్యాక్సిన్లపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్నారులకు టీకాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

దేశంలో చిన్నారుల కోసం ప్రస్తుతం నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు మరోకటి వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ దశలో ఉందని తెలిపింది.

రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా విజ్ఞాన, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ 3.0లో భాగంగా ‘మిషన్ కోవిడ్ సురక్ష-ఇండియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ డెవలప్ మెంట్ మిషన్ ప్రకటించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం కాడిల్లా హెల్త్ కేర్ లిమిటెడ్ డీఎన్ఏ ఆధారిత టీకా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో ఉందని.. దీని అత్యవసర వినియోగ ఆమోదం కోసం మధ్యంతర డేటాను కూడా సమర్పించిందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక బయోలాజికల్ ఈ లిమిటెడ్ టీకా కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్లు తెలిపారు. ముక్కులో పిల్లలకు వేసే ‘భారత్ బయోటెక్’ టీకా కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉందని వివరించారు.

ఇక ఇవే కాకుండా జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకా ట్రయల్స్ మొదటి దశలో ఉన్నాయని తెలిపారు. గుర్గావ్ కు చెందిన జెనిక్ లైఫ్ సైన్సెస్ టీకా అడ్వాన్స్ డ్ ప్రీ క్లినికల్ దశలో ఉందని తెలిపారు.

థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ముక్కులో వేసే భారత్ బయోటెక్ టీకాతో చిన్నారులపై ముప్పు తగ్గవచ్చని తొందరగా పంపిణీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.