https://oktelugu.com/

దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

ఒక దేవుడు.. చాలా ప్రసిద్ధికెక్కిన గణేషుడు.. దేశ విదేశాల్లో ఖైరతాబాద్ గణేషుడంటే ఎంతో ఫేమస్. ప్రతీ సంవత్సరం ఈ గణేషుడికి అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అయితే కరోనా కారణంగా ఈసారి వేడుకలకు ఆటంకం కలుగుతోంది. Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా? అయితే ఈ ఖైరతాబాద్ గణేషుడు కోసం ఇప్పుడు టీఆర్ఎస్ లో ఫైట్ జరుగుతోంది. ఇద్దరు పెద్ద టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 8, 2020 / 05:00 PM IST
    Follow us on

    ఒక దేవుడు.. చాలా ప్రసిద్ధికెక్కిన గణేషుడు.. దేశ విదేశాల్లో ఖైరతాబాద్ గణేషుడంటే ఎంతో ఫేమస్. ప్రతీ సంవత్సరం ఈ గణేషుడికి అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అయితే కరోనా కారణంగా ఈసారి వేడుకలకు ఆటంకం కలుగుతోంది.

    Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

    అయితే ఈ ఖైరతాబాద్ గణేషుడు కోసం ఇప్పుడు టీఆర్ఎస్ లో ఫైట్ జరుగుతోంది. ఇద్దరు పెద్ద టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు బలమైన నాయకులు.. కొన్నేళ్లుగా ఒకరితో ఒకరు పోటీపడ్డారు. కానీ ఇప్పుడు ఖర్మ కాలి ఒక పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ పాత పగలతో వారిద్దరు గొడవపడుతున్నారు.

    ఖైరతాబాద్ గణేషుడి కోసం ఇప్పుడు ఫైట్ మొదలైంది. కరోనా భయాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ఎత్తును తగ్గించాలని గణేష్ మండపకమిటీ నిర్ణయించింది. విగ్రహం పరిణామాన్ని 3 అడుగులకే పరిమితం చేయాలని పోలీసులు సైతం సూచించారు.

    పోలీసుల సూచనతో విభేదించిన ఖైరతాబాద్ గణేష్ మండలి సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సంప్రదించారు. అయితే మంత్రి తలసాని 4 అడుగుల విగ్రహాన్ని ఈసారి ప్రతిష్టించుకోవాలని సూచించి ఒప్పించారు.

    అయితే ఇదే ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ జోక్యం చేసుకొని ఎత్తును 9 అడుగులకు పెంచారు. తన నియోజకవర్గంలో మంత్రి తలసాని జోక్యంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తిచేసినట్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలోని వ్యవహారాల్లో తలసాని జోక్యంపై పెద్దల వద్ద దానం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.

    Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

    మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఉదంతంలో చివరకు దానం మాటతో 9 అడుగుల పొడవైన గణేషుడితో కమిటీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే తయారీ మొదలైంది. దీంతో దేవుడి పేరిట రాజకీయం ఇద్దరు టీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చుపెట్టింది. చివరకు మంత్రి వాదన సైతం పక్కకుపోయి స్థానిక ఎమ్మెల్యేనే గెలిచేశారు. దేవుడి కోసం టీఆర్ఎస్ లో జరిగిన ఈ ఫైట్ చర్చనీయాంశమైంది.