Site icon OkTelugu

India future development 13 districts: భారత భవిష్యత్‌ను మార్చబోతున్న 13 జిల్లాలు.. మ్యాప్‌ కూడా మరే ఛాన్స్‌?

India future development 13 districts

India future development 13 districts

India future development 13 districts: భారత దేశం యొక్క రాబోయే 20 నుంచి 30 ఏళ్ల భవిష్యత్తును దేశంలోని కేవలం 13 జిల్లాల జనాభా స్వరూప స్వభావాలు నిర్ణయించబోతున్నాయి. ఈ 13 జిల్లాల జనాభా 2.80 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, అది భారత్‌లో ఉంటుందా.. వెళ్లిపోతుందా వేరే దేశం అవుతుందా అన్నది నిర్ధారిస్తుంది. ఈ 2.80 లక్షల చదరపు కిలోమీటర్లు 7 రాష్ట్రాలతో కలిసి ఉన్నాయి. ఈ 13 జిల్లాలు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్‌ 100 కి.మీ పొడవు. 22 కి.మీ వెడలప్పు ఉన్న ఈ కారిడార్‌కు సమీపంలో అస్సోం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు చెందిన 13 జిల్లాలు రాబోయే పది ఇరవై ఏళ్లలో భారత దేశంపు భాగ్యాన్ని నిర్ధారించడంతోపాటు ఇండియా మ్యాప్‌ ఎలా ఉంటుందో డిసైడ్‌ చేస్తుంది.

సిలిగురి కారిడార్ కీలకం..
సిలిగురి 100 కి.మీ. పొడవు, 22 కి.మీ. వెడల్పు కలిగిన చిమటాగా ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాలను దేశ మిగిలిన భాగంతో కలుపుతుంది. ఈ కారిడార్‌ సమీపంలో బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని 13 జిల్లాలు ఉన్నాయి, ఇవి 2.8 లక్ష చ.కి.మీ. విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాల జనాభా మార్పులు ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్తును, దేశ మ్యాప్‌ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి.

13 జిల్లాలు ఇవే..
బిహార్‌లోని అరరియా, పూర్ణియా, కటిహార్, కిషన్‌గంజ్‌ జిల్లాలు 38–68% ముస్లిం జనాభా కలిగి ఉన్నాయి. బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్నాయి. మొత్తం జనాభాలో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చినవారే ఎక్కువ. ఇక పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్‌ కూడా ముస్లిం జనాభా కలిగిన దేశాలే. ఉత్తర బెంగాల్‌కు కీలకం, హిందూ–ముస్లిం సమతుల్యం జార్ఖండ్‌కు చెందిన పాకూరు, గోద్డా, సాహిబ్‌గంజ్, దుమ్కా, జమతారా, దేవఘర్‌ గిరిజన జిల్లాలు 44 శాతం ఉన్న వీరి జనాభా ఇప్పుడు 22 శాతానికి పడిపోయింది. ఇక ముస్లిం జనాభా 7 శాతం నుంచి 24 శాతానికిపెరిగింది. ఈ జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుదల బంగ్లాదేశ్‌ చొరబాటు, సంఘటనా ప్రభావాలతో ముడిపడి ఉంది.

Also Read: ధరల తుఫాను.. రెండు వారాల్లో సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం!

చారిత్రక నేపథ్యం
1946 ముస్లిం లీగ్‌ తీర్మానం ఈ జిల్లాలను బెంగాల్‌లో కలపాలని డిమాండ్‌ చేసింది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ప్రయత్నాలతో హిందూ బలమైన ప్రాంతాలు బెంగాల్‌లో ఉంచబడ్డాయి. 1956 వరకు ఈ ప్రాంతాల్లో విభజన ఉద్రిక్తతలు కొనసాగాయి. పాకిస్తాన్‌ 1940 నుంచి ఈ జిల్లాలపై కన్ను పెట్టింది.

భవిష్యత్‌ ప్రశ్నార్థకం..
ఈ 13 జిల్లాల జనాభా మార్పులు ఈశాన్య రాష్ట్రాల భద్రతను, రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తాయి. బీజేపీ బలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్ష ఆధిపత్యం పెరిగే అవకాశం. ఇటీవల బిహార్‌ నేత ప్రకటనలు సిలిగుడి ’నెక్‌’ను లక్ష్యంగా చేసుకున్నాయి. 2050 నాటికి భారత్‌ 170 కోట్ల జనాభాకు చేరుకుంటుంది, ఈ ప్రాంతాలు దానిలో కీలక పాత్ర పోషిస్తాయి.

జనాభా అసమతుల్యత భారత్‌లో ఉత్తర–దక్షిణ విభేదాలను పెంచుతోంది. ఈశాన్య భద్రతా ప్రణాళికలు, జనాభా నిర్వహణ విధానాలు తప్పనిసరి. రాబోయే జనాభా లెక్కలు ఈ ట్రెండ్‌ను స్పష్టం చేస్తాయి, దేశ ఐక్యత కాపాడటానికి చర్యలు తీసుకోవాలి.

Exit mobile version