Site icon OkTelugu

Komatireddy skipped Gaddar Awards event: గద్దర్‌ అవార్డ్స్‌ కు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారు? ఏంటి కథ?

Komatireddy skipped Gaddar Awards event

Komatireddy skipped Gaddar Awards event

Komatireddy skipped Gaddar Awards event: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డులను పునరుద్ధరించింది. గద్దర్‌ పేరుతో గతేడాది నుంచి అవార్డులు ఇస్తోంది. గడిచిన పదేళ్ల అవార్డులను గతేడాది ఇచ్చింది. తాజాగా గతేడాదికి సంబంధించిన పురస్కారాలను ప్రకటించింది. ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రదానం చేశారు. అయితే ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి దూరంగా ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఆయన శాఖలో ప్రభావం తగ్గుతున్నట్లు సూచిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టికెట్‌ ధరల వివాదాలు, ఇతరుల జోక్యం ఈ పరిస్థితికి మూలాలుగా కనిపిస్తున్నాయి.

అవార్డు వేడుక మంత్రి డుమ్మా..
ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఇంటి యజమాని కచ్చితంగా ఉంటారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఆ శాఖ మంత్రి ఉంటారు. సీఎం కార్యక్రమం అయితే అన్ని శాఖ మంత్రులు వస్తారు. కానీ ఉగాది ఉత్సవాల సందర్భంగా హైటెక్‌ సిటీలో ఘనంగా జరిగిన గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. సినిమా ప్రతిభలకు పురస్కారాలు ప్రదానం అయినా, శాఖ మంత్రి కోమటిరెడిడ వెంకటరెడ్డి లేకపోవడం అసాధారణంగా మారింది. కమిటీ సమావేశాల్లో డెప్యూటీ సీఎం ఆధ్వర్యంలోనే నిర్ణయాలు జరగడం ఈ దూరంగా ఉండటానికి కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.

శాఖలో ప్రమేయం లోపం
టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోల అనుమతులు మంత్రి తెలియకుండానే జరగడం గతంలోనే వివాదాస్పదమైంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సమయంలో సీఎం నేరుగా సినీ కార్మిక సమావేశంలో నిర్ణయాలు ప్రకటించడం ఆయన పాత్రను సందిగ్ధం చేసింది. ఇప్పుడు మంత్రి లేని పరిస్థితి లేకుండా ఇలాంటి అధికార శూన్యతలు ఏర్పడుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: మెగాస్టార్ ను వదలరా?.. ఆ ఒక్క మాటను పట్టుకొని!

రాజకీయ ఒత్తిడులు
ఆర్‌ అండ్‌ బీ శాఖలో హ్యామ్‌ రోడ్ల ఆరోపణలు, డెప్యూటీ సీఎం నిధుల వెల్లడి వంటి సంఘటనలు కోమటిరెడ్డి స్థానాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి టార్గెటింగ్, పీసీసీ నేతలపై వ్యాఖ్యలు కూడా ఆయన చుట్టూ గుసగుసలు పెంచాయి. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి అవకాశం ఉందనే పుకార్లు ఈ దూరంగా ఉండటాన్ని ప్రేరేపించాయని అంచనా.

సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌
డమ్మీ మంత్రి అనే ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో మెమెస్, విమర్శలు వర్షాధారంగా కురుస్తున్నాయి. గత టికెట్‌ వివాదాల నుంచి ఈ ఘటన వరకు ఆయన ఇమేజ్‌పై గణనీయ ప్రభావం పడింది. ఇది కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల్లో ఉద్యమ నాయకుడి మార్పును సూచిస్తోంది.

ఈ ఘటన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ బలాన్ని పరీక్షిస్తోంది. మంత్రి పదవి కాపాడుకోవడంలో కీలకమైన దశ. ప్రభుత్వం శాఖల్లో స్పష్టమైన అధికార విభజన అవసరం. లేకపోతే ఇలాంటి చర్చలు మరింత పెరుగుతాయి.

 

Exit mobile version