Site icon OkTelugu

IPL 2026 Chennai team condition: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

IPL 2026 Chennai team condition

IPL 2026 Chennai team condition

IPL 2026 Chennai team condition: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి చెన్నై సూపర్ కింగ్సే. ఈ జట్టు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన జట్లలో ముంబై తో సమానంగా చెన్నై కొనసాగుతోంది.

చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారధిగా ఉన్నాడు. 2024 వరకు ధోని నాయకుడిగా ఉన్నాడు. 2024లో ధోని అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. దీంతో మేనేజ్మెంట్ గైక్వాడ్ కు అవకాశం ఇచ్చింది. చెన్నై జట్టు 2023లో చాంపియన్ అయింది.. 2024 లో మాత్రం డిపెండింగ్ ఛాంపియన్ స్థాయిలో ఆడ లేకపోయింది. 2025 లో కూడా నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో చెన్నై జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఒకానొక దశలో తాత్కాలిక సారధి ధోని కూడా జట్టు లో ప్లేయర్లపై తీవ్రస్థాయిలో విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్లేయర్లతో ఐపీఎల్ ఎలా ఆడతామని మండిపడ్డారు.

2025 లో దారుణమైన ఆట తీరు తర్వాత చెన్నై మేనేజ్మెంట్ పూర్తిగా మారిపోయింది. జట్టును కింది నుంచి పై వరకు ప్రక్షాళన చేసింది. రాజస్థాన్ నుంచి సంజు శాంసన్ ను తీసుకుంది.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టింది. ఈ స్థాయిలో మార్పులు చేసినప్పటికీ ఇప్పుడు చెన్నై జట్టుకు ఊహించని అంతరాయం ఎదురైంది.

Also Read: గత ఏడాది మిస్సయింది.. ఈసారి పంజాబ్ పంజా విసురుతుందా?

బ్యాటింగ్లో చెన్నై జట్టుకు తిరుగులేదు. ఈసారి 200 ప్లస్ స్కోర్ చేస్తామని ఆటగాళ్లు చెబుతున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో బీభత్సంగా పాల్గొంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. చెన్నై జట్టు కు సంబంధించి కీలకమైన బౌలింగ్ విభాగం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. చెన్నై జట్టు బౌలింగ్ మొత్తం నాదన్ ఎల్లిస్ మీద ఆధారపడి ఉంది. దాని తగ్గట్టుగానే అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే ఇటీవల అతడు గాయపడ్డాడు. పరీక్షించిన వైద్యులు అతడు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇప్పుడు అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా చెన్నై జట్టుకు షాకింగ్ లాంటి పరిణామం. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకుంటారు.. ఎవరితో ఆస్థానాన్ని భర్తీ చేస్తారు.. అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, హెన్రీ వంటి వారు ఉన్నప్పటికీ.. వారు ప్లాట్ పిచ్ ల పై సత్తా చూపించలేక పోతే చెన్నై జట్టు ఈసారి కూడా సర్దుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Exit mobile version