Dhurandhar 2 Ban Demand Controversy: దురంధర్.. సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా. పాకిస్తాన్‌లో భారత ఏజెంట్ల గూఢచర్యాన్ని ఇందులో చూపించారు. ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. దీనికి సీక్వల్‌గా తెరకెక్కిన ‘దురంధర్ 2’ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. యావత్ దేశం మొత్తం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి రోజే రూ.248 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఇప్పుడు మన దేశంలోని రెండు ప్రధాన పార్టీలు, మరికొన్ని చిన్నాచితక పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అందరికీ దేశభక్తి, పాకిస్తాన్ కుట్రలు, మాఫియా, ఉగ్రవాద చర్యలు కనిపిస్తుంటే.. ఆ పార్టీలకు మాత్రం ఈ సినిమా ముస్లిం వ్యతిరేక సినిమాగా కనిపిస్తుందట.
Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?
సినిమా కథన సారాంశం
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో 4 గంటల సీక్వెల్‌లో భారత ఏజెంట్ హమ్జా పాక్ ఐఎస్‌ఐ, లష్కర్–ఏ–తొయిబా కుట్రలను ఛేదిస్తాడు. యూపీ మాఫియా, దొంగ నోట్ల రద్దు ప్రభావం, జాకీర్‌నాయక్ రెండు పాక్ ఉగ్రవాదులను మోసం చేసి భారత్‌ను రక్షిస్తాడు. మొదటి భాగం రూ.1300 కోట్లు సాధించినా, ఇది మరింత భారీగా ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతోంది. పాకిస్తాన్‌లో నిషేధించినా పైరసీ ద్వారా వీక్షణ జరుగుతోంది.
రాజకీయ నేతల విమర్శలు
కాంగ్రెస్, సమాజ్‌వాదీ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, రషీద్ అల్వీ, తారిక్ అన్వర్ సినిమాను బీజేపీ ఎజెండాతో రూపొందించారని, ఇది మత ద్వేషాన్ని పెంచుతుందని ఆరోపించారు. çఈ సినిమా ‘సమాజాన్ని విడదీయడానికి ఉపయోగపడుతుంది, యువతకు తగని హింస‘ అని రాజేశ్ రాథోడ్, అసిత్ నాథ్ తివారీలు అన్నారు.
ఒకప్పుడు దావూద్ కనుసన్నల్లో..
2014 ముందు దావూద్ ఇబ్రహీం ప్రభావంతో ఉగ్రవాదాన్ని మెత్తగా చూపించే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు జాతీయవాద కథనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ’దురంధర్’ సిరీస్ దాని ఉదాహరణ, పాక్ మేజర్ ఇక్బాల్, ఎంపీ జమీల్ వంటి పాత్రలు రియల్ ఇన్సి్పరేషన్‌తో తయారయ్యాయి. ముంబై పోలీసు డ్రోన్ ఉల్లంఘనలపై కేసు నమోదు చేసినా, రిలీజ్‌కు ప్రభావం లేదు. పాకిస్తాన్ ప్రజలు దురంధర్ 1 ను ఎక్కువగా చూశారు. ప్రభుత్వం నిషేధించినా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించారు. మన నాయకులకు మాత్రం ముస్లిం వ్యతిరేకత మాత్రమే కనిపిస్తుంది
సినిమా విజయం బీజేపీకి ప్రచారంగా మారడం, ప్రతిపక్షాల బ్యాన్ డిమాండ్లు రివర్స్ ప్రచారంగా పనిచేయడం ఆసక్తికరం. కంటెంట్ స్వేచ్ఛ, రాజకీయ సున్నితత్వం మధ్య సమతుల్యత అవసరం. ఈ వివాదం బాలీవుడ్‌లో జాతీయవాద ట్రెండ్‌ను బలోపేతం చేస్తోంది.
