మోదీ క్యాబినెట్లో కొత్తగా ఎంతమంది ఎంట్రీ ఇవ్వనున్నారు?

ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి క్యాబినెట్ విస్తరించాలని భావిస్తున్నారు. ఎన్టీఏ 2.0 ఏర్పడిన తర్వాత క్యాబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ ఇప్పటివరకు పెద్దగా దృష్టిసారించలేదు. ప్ర‌స్తుతం మోడీ క్యాబినెల్లో 57మంది మంత్రులు ఉన్నారు. అయితే కేంద్ర క్యాబినెట్‌లో 81మంది వరకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ లెక్కన మ‌రో 24మందికి మోదీ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత క్యాబినెట్లో ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే […]

Written By: Neelambaram, Updated On : August 8, 2020 4:45 pm
Follow us on


ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి క్యాబినెట్ విస్తరించాలని భావిస్తున్నారు. ఎన్టీఏ 2.0 ఏర్పడిన తర్వాత క్యాబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ ఇప్పటివరకు పెద్దగా దృష్టిసారించలేదు. ప్ర‌స్తుతం మోడీ క్యాబినెల్లో 57మంది మంత్రులు ఉన్నారు. అయితే కేంద్ర క్యాబినెట్‌లో 81మంది వరకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ లెక్కన మ‌రో 24మందికి మోదీ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత క్యాబినెట్లో ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఆగస్టు 15లోపు మోదీ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహులు మోదీ క్యాబినెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: ఇదో పెద్ద జోకు: మోడీకే మళ్లీ కావాలట?

మోదీ క్యాబినెట్లో చోటు ఎవరెవరీకి దక్కుతుందనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత క్యాబినెట్లోకి ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బలపర్చేలా, యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. వీరిలో ప్రధానంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింథియా పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. గతంలో బీజేపీ అధిష్టానం సింథియాకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించింది. తాజాగా మోదీ క్యాబినెట్లో మంత్రి పదవీ ఇవ్వనుందనే టాక్ విన్పిస్తోంది.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి క్యాబినెట్లోకి ఎంతమంది వెళుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్డీఏ తొలిసారి మంత్రివర్గంలోనూ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా చోటుదక్కిన దాఖలాల్లేవు. నాడు తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర హోదా కలిగిన మంత్రి ఇచ్చారు. ఇక ఏపీ నుంచి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు, సుజానా చౌదరిలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత బీజేపీ-టీడీపీ కూటమి బంధానికి బీటలు పడటంతో ఆ ఇద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక్కరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి పదవీ దక్కింది. ఏపీ నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యం దక్కలేదు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడేందుకు యత్నిస్తుండటంతో మోదీ క్యాబినెట్లో పలువురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర‌రావు, బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా విన్పిస్తోంది. వీరితోపాటు బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, సోయం బాపూరావులలో ఎవరికీ ఛాన్స్ లభిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా లేకపోవడంతో తప్పకుండా ఒకరిద్దరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం బీజేపీకి టీడీపీ నుంచి వెళ్లిన ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌, టీజీ వెంక‌టేశ్ ఉన్నారు. వీరిలో సుజ‌నా చౌద‌రికి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయనకు మంత్రి పదవీ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

అలాగే బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్, దివంగత ఎన్టీఆర్ కూతురు పురంధశ్వరీ పేర్లు విన్పిస్తున్నా. క్యాబినెట్లోకి తీసుకుంటే వీరికి తీసుకుంటే మాత్రం మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. దీంతో వీరిద్దరికి ఛాన్స్ వస్తుందో లేదో చెప్పడం కష్టంగా మారింది. అయితే యూపీఏ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు పది మంది మంత్రులు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకునేవారు. అయితే ఎన్డీఏ హయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఒకటి రెండు పదవులు మాత్రమే దక్కుతుండటం గమనార్హం. ఈసారి క్యాబినెట్లో విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుందో లేదో వేచిచూడాల్సిందే..!