జోనర్ సరే.. పోస్టర్ కూడా కాపీ కొట్టేస్తావా ప్రశాంత్‌!

టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా నడుస్తోంది. వైవిధ్యమైన కథలు, కథనాలతో స్టార్ హీరోలను ఇంప్రెస్‌ చేస్తున్న కుర్రాళ్లు భారీ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. అలాంటి డైరెఓర్లలో ఒకడు ప్రశాంత్‌ వర్మ. తన మొదటి సినిమా ‘అ’తోనే టాలెంట్‌ నిరూపించుకున్నాడు. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. కాజల్‌ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, రెజీనా , ఈషా రెబ్బ, ప్రియదర్శి, శ్రీనివాస్‌ అవసరాల, మురళీ శర్మ నటించిన ఈ మూవీ రెండు నేషనల్‌ అవార్డులు సొంతం […]

Written By: Neelambaram, Updated On : August 8, 2020 6:08 pm
Follow us on


టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా నడుస్తోంది. వైవిధ్యమైన కథలు, కథనాలతో స్టార్ హీరోలను ఇంప్రెస్‌ చేస్తున్న కుర్రాళ్లు భారీ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. అలాంటి డైరెఓర్లలో ఒకడు ప్రశాంత్‌ వర్మ. తన మొదటి సినిమా ‘అ’తోనే టాలెంట్‌ నిరూపించుకున్నాడు. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. కాజల్‌ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, రెజీనా , ఈషా రెబ్బ, ప్రియదర్శి, శ్రీనివాస్‌ అవసరాల, మురళీ శర్మ నటించిన ఈ మూవీ రెండు నేషనల్‌ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ వెంటనే రాజశేఖర్తో ‘కల్కి’ మూవీ తీసి ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరో రాజశేఖర్ను డిఫరెంట్‌ లుక్‌లో ప్రజెంట్‌ చేశాడు ప్రశాంత్. ఆ పై కరోనా వ్యాక్సిన్‌ ఇతివృత్తంగా మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి అతను హారర్ జోనర్ ఎంచుకున్నాడు. హాలీవుడ్‌ హారర్ జోనర్లో జాంబీ చిత్రాలకు మంచి పేరుంది. ఇండియాలో ఈ తరహా చిత్రాలు ఇప్పటిదాకా వచ్చింది తక్కువే.

Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం.. అభిషేక్‌ కూడా ఇంటికి..

అయితే, ఫస్ట్‌ టైమ్‌ తెలుగు జాంబీ ఫిల్మ్‌ను ప్రశాంత్‌ ఈ రోజు (శనివారం) ప్రకటించాడు. దీనికి ‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేసి మోషన్‌ పోస్టర్ను రిలీజ్‌ చేశాడు. ఓ స్మశానం, మబ్బులు కమ్మిన వాతావరణం, ఎరుపెక్కిన చంద్రుడిని చూపిస్తూ భూమి నుంచి బయటికొచ్చి ఓ చేయిలో టైటిల్‌కు మ్యూజిక్‌ను జోడించి భయపెట్టేప్రయత్నం చేశాడు. రివెంజ్‌ ఆఫ్‌ ద డెడ్‌ అనేది ఈ మూవీకి ట్యాగ్‌ లైన్‌. ఆపిల్‌ స్టూడియోస్ బ్యానర్పై రాజశేఖర్ వర్మ ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. మార్క్‌ కే రాబిన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

ఈ మూవీ కరోనా బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. కరోనా కంటే భయంకరంగా ఉంటుందని ప్రశాంత్‌ పేర్కొన్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. తన మూవీ అనౌన్స్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే ప్రశాంత్‌ వర్మపై ట్రోలింగ్‌ మొదలైంది. కాపీ క్యాట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కారణం జాంబీ జానర్ ఎంచుకోవడం కాదు.. అలాంటి చిత్రాల పోస్టర్స్‌ను ‘జాంబీ రెడ్డి’ పోస్టర్ పోలి ఉండడమే. ఈ జానర్లో విడుదలైన ‘ద డెడ్‌ డోంట్‌ డై’తో పాటు ఇంకా రిలీజ్‌ కాని ‘డే ఆఫ్‌ ద డెడ్‌’ ‘ఆర్మీ ఆఫ్‌ ద డెడ్‌’ పోస్టర్స్‌ను కాపీ కొట్టి జాంబీ రెడ్డి పోస్టర్డిజైన్‌ చేశాడని ప్రశాంత్‌పై ట్విట్టర్లో విమర్శలు వస్తున్నాయి. ఆయా చిత్రాల పోస్టర్లను షేర్ చేసి ప్రశాంత్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. దాంతో, కొత్త చిత్రం ప్రకటించిన ఆనందం ఎంతోసేపు లేకుండా పోయిందీ యువ దర్శకుడికి.