https://oktelugu.com/

పట్టు వీడని రైతులు.. మెట్టు దిగని కేంద్రం

రైతులు పట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన విషయంలో ప్రతిష్ఠంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు, రైతు సంఘాల లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిపిస్తున్నారు. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. Also Read: ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా..? రైతు సంఘాల ప్రతినిధులతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 8, 2021 11:04 am
    Follow us on

    Farmers Protest
    రైతులు పట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన విషయంలో ప్రతిష్ఠంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు, రైతు సంఘాల లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిపిస్తున్నారు. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

    Also Read: ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా..?

    రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపినా ఫలించలేదు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాల్లో ఒకటైన కనీస మద్దతు ధరపై సందేహాలు అక్కర్లేదని కేంద్రం చెబుతోంది. ఎంఎస్‌పీ యథావిధిగా కొనసాగుతుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే చెప్పారు. అలాగే, రైతు సంఘాల ప్రతినిధులతో పలు దఫాలు జరిగిన చర్చల్లో భాగంగా చట్టాల్లో కొన్ని సవరణలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే… కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనంటున్నారు రైతులు.

    కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎనిమిదోసారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగనున్నాయి. 40 రైతు సంఘాల కేంద్ర మంత్రులు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత లాంటి కీలకాంశాలపై చర్చించనున్నారు.

    Also Read: ట్రంప్‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పంచ్‌ : ఆయన ఖాతాలపై నిషేధం

    కాగా.. గతంలో జరిగిన చర్చల్లో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయానికి కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అటు వ్యవసయ చట్టాల్లోని అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే నేటి చర్చలు సఫలం అవుతాయని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఇప్పటికే రైతుల సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగే చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్