ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటివరకు మనకు తెలిసిన పేరు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే ఆయన్ని వెనక్కి నెడుతూ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. 500 మంది కుబేరులతో బ్లూమ్‌బర్గ్ రూపొందించిన బిలియనీర్స్ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: ఫోన్ పే యూజర్లకు శుభవార్త.. రూ.149కే ఇన్సూరెన్స్ పాలసీ..?
ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎల్ఎల్‌సీ పేరిట ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కంపెనీలు నిర్వహిస్తుండగం గమనార్హం. ఎలాన్ మస్క్ సంపద నికర విలువ గురువారం నాటికి 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.13 లక్షల కోట్లు. ఈ సంపద విలువతో అక్టోబర్ 2017 నుంచి అపర కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించాడు.
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ గురువారం 7.4 శాతం పెరిగి.. 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో ఆయన అత్యంత ధనవంతుడు అయ్యారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆధారంగా గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద విలువ ఏకంగా 188.5 బిలియన్ డాలర్లకు చేరింది.
Also Read: తలొగ్గిన డొనాల్డ్ ట్రంప్.. అధికారం అప్పగింతకు అంగీకారం
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. ఇక గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఏడాది కాలంలోనే మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. ఇక 2020 నవంబర్ చివరిలో ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవగా.. ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే మొదటి స్థానానికి చేరారు. ఇక ఎలాన్ మస్క్ కేవలం కార్ల సంస్థనే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో రాకెట్ల తయారీ సంస్థతో పాటు, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా స్థాపించారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు