గడిచిన రెండు, మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక దశలో పెట్రోల్ ధర రెండేళ్ల గరిష్టానికి చేరింది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు అమలైన తరువాత దేశంలోని వాహనదారులు ప్రజా రవాణా కంటే సొంత వాహనాలపై ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. సొంత వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.
Also Read: ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా..?
పెట్రోల్ దారిలోనే డీజిల్ ధరలు కూడా పెరుగుతుండటం రెండింటి ధరల మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉండటం గమనార్హం. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. అయితే వాహనదారులకు శుభవార్త చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవాళ్లకు శుభవార్త.. ఫ్రీగా రూ. లక్ష ప్రయోజనాలు..?
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గమనార్హం. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉందని త్వరలో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 8 రూపాయల నుంచి పది రూపాయల వరకు పెంచింది. ప్రస్తుతం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ లను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్యాక్స్ లను తగ్గించే అవకాశాలు ఉంటాయి. మరోవైపు గత రెండు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ట్యాక్స్ లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.