
George Soros- Modi: అదేంటో గాని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మోడీకి సంబంధించి ఏ మాత్రం వ్యతిరేకంగా ఒక్క మాట వినిపించినా, ఒక్క చేత కనిపించినా తాటికాయంత అక్షరాలతో రాసేస్తాడు.. ఏదో జరిగిపోతోంది అనే భ్రమ కల్పిస్తాడు. చూశారా నేను మోదీని నడి బజార్లో నిలబెట్టాను అంటూ ఫోజు కొడతాడు.. అదే అమిత్ షా ఫోన్ చేయగానే తన పేపర్లోనే బీభత్సంగా రాసేసుకుంటాడు..పూర్తి అబ్సర్డ్ జర్నలిస్ట్. అతని మాటలాగే.. వార్తలు కూడా తింగరి తింగరిగా ఉంటాయి.. సరే సోరోస్ విమర్శించాడు.. మోదీని తిట్టాడు. ఆదానీని విమర్శించాడు. కానీ దాని వెనుక ఉన్నది ఏమిటో, ఏ ప్రయోజనాలు ఆశించి అలా చేస్తున్నాడో తెలుసుకోవద్దా? ఎవడు ఏం మాట్లాడినా రాసేయడమేనా జర్నలిజం అంటే? అలాంటప్పుడు వాట్సప్ పీడీఎఫ్ పేపర్లకు, ఆంధ్రజ్యోతికి తేడా ఏముంటుంది? ఇదే సోరోస్ తన గురువు చంద్రబాబును విమర్శిస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలాగే రాసేవాడా? ఇలాగే వార్తలు ప్రచురించేవాడా?
తెరమీదకు వచ్చాడు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలియనిది ఏమిటంటే ఈ సోరోస్ స్వాతిముత్యం లాంటి క్యారెక్టర్ కాదు. పక్కా బిజినెస్ మాన్. ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తాడు. అడ్డగోలుగా సంపాదిస్తాడు. బ్యాంకులను నిండా ముంచేస్తాడు. తన ప్రయోజనాలకు ఎవరైనా అడ్డం వస్తే లేనిపోని విమర్శలు కూడా చేస్తాడు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు. ఇటీవల జర్మనీలో సోరోస్ విలేకరులతో మాట్లాడాడు. హిండెన్ బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని గౌతమ్ ఆదాని కంపెనీ పై నోరు పారేసుకున్నాడు. మోడీ గౌతమ్ ఆదానికి అన్ని రకాల మేళ్ళు చేసి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. అక్కడ జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సమావేశాన్ని పక్కనపెట్టి భారత్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనే ఎన్జీవోను 1963 లో ఎవాల్డ్ హెన్రిచ్ వాన్ క్లిస్ట్ ప్రారంభించాడు. ఇది మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటయ్యా అంటే.. ఎలాంటి సరిహద్దులేని నిర్ణయాలను అమలు చేయడం. సరిహద్దులు లేని అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఎలాంటి కార్యక్రమాన్నయినా అడ్డుకోవడం, ఎదుర్కోవడం, నిరసనలు తెలపడం, అవసరమైతే ఆయా దేశాల సహకారంతో బల ప్రయోగం చేయించడం.. ఈ పనులకు ప్రజాస్వామ్య విలువలు కాపాడటం అనే ముద్దు పేరును వాడుకుంటుంది. సద్దాం హుస్సేన్ ను గద్దె దించడంలో ఈ సంస్థ కీలకంగా పనిచేసింది. తర్వాత ఏం జరిగిందో జగత్ విదితమే. మహమ్మద్ గడాఫీ ని కూడా విలన్ గా ప్రపంచానికి చూపించింది కూడా ఇదే సంస్థ.

ఇక ఇలాంటి సంస్థ మ్యూనిచ్ లో మీటింగ్ పెడితే దాన్ని ఏమనుకోవాలి? ఉక్రెయిన్ కు ఆధునాతన యుద్ధ విమానాలు ఇవ్వాలని అందులో పాల్గొన్న సోరోస్ తో సహా అందరూ డిమాండ్ చేశారు.. మరీ ప్రజాస్వామ్య పరిరక్షకులు ఇలా చేయవచ్చునా? ఇక సోరోస్ నేరుగా మోది మీద విమర్శలు చేసేందుకు ప్రధాన కారణం రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనడం. దీనిని శుద్ధిచేసి ఇతర దేశాలకు భారత్ సరఫరా చేస్తోంది. దీనివల్ల యూరప్ దేశాల ఆదాయానికి గండిపడుతోంది.. ఇదంతా మోడీ, పుతిన్ చేస్తున్నారు అనేది సోరోస్ అభియోగం. అందుకే భారత్ మీద అమెరికా ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు బెలెన్ స్కీ తో సో రోస్ ప్రకటన చేయించాడు. అంతేకాదు వ్యాపారవేత్తయిన సోరోస్ అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. తన నలుపు చూసుకోలేక ఇతరుల తప్పులు ఎంచుతున్నాడు. కానీ ఇతగాడి చరిత్ర తెలియని రాధాకృష్ణ మోదీని తిట్టుగానే అహో ఓహో అంటూ రాసుకుంటూ వచ్చాడు. కొంప తీసి సోరోస్ ఏమైనా ఆంధ్రజ్యోతిలో పెట్టుబడులు గాని పెట్టాడా ఏమిటి?