వాహ్.. ఎన్నికలంటే ఇవి. ఫలితాలంటే ఇవి.. అన్నట్లుగా సాగుతోంది దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్స్ చూస్తుంటే. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఏ రౌండ్‌లో ఎవరు లీడ్‌లోకి వస్తారా అని ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు ఎనిమిది రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా.. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. దీంతో టీఆర్ఎస్‌లో టెన్షన్ కనిపిస్తోంది. రౌండ్ రౌండ్‌కూ టీఆర్‌ఎస్ నేతల్లో నైరాశ్యం పెరుగుతోంది.
Also Read: రాములమ్మ పోతే పోనీ.. కాంగ్రెస్ లైట్
ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లకు గాను మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆరు, ఏడు రౌండ్లలో మాత్రం టీఆర్‌ఎస్ ఆధిక్యం చాటింది. ఎనిమిదో రౌండ్‌లో మళ్లీ అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 3,106 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Also Read: ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు దుబ్బాకలో షాక్
మొదట పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యతను కనబరుచగా.. టీఆర్ ఎస్ మరోసారి తన హవా కొనసాగించనున్నట్టు అందరూ సంబరపడిపోయారు. మొదటి రౌండ్ ఫలితం వచ్చినప్పుడు దుబ్బాక అర్బన్‌లో బీజేపీకి పట్టు ఉందని, అక్కడ మెజార్టీ వస్తుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నామని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. ఆ తర్వాత రూరల్‌కు వచ్చే సరికి కూడా అవే ఫలితాలు పునరావృతం కావడంతో ఐదో రౌండ్ వరకూ ఇట్లే ఉంటుందని మళ్లీ టీఆర్ఎస్ నేతలు మాట మార్చారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. మధ్యాహ్నానికే ఫలితం రావాల్సి ఉన్నా.. ఇంతవరకు సగం కూడా పూర్తి కాలేదు. మొత్తం 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 8 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాత్రం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలకవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.