అందం పెట్టుబడి: లాక్డౌన్ లో లక్షల సంపాదన!

కరోనా లాక్డౌన్ తో అనేక వ్యాపార సంస్థలు దాదాపు దివాలా తీశాయి. పని లేక పేదలు పస్తులున్నారు. కానీ కొందరు మాత్రం తమ తెలివిని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించారు. అందచందాలను ఆరబోసి యువకులు, ప్రముఖులకు వల వేసి లక్షలకు లక్షలు వారి వద్ద నుంచి వసూలు చేశారు. ఈ మేరకు 72 మంది బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అమ్మాయిలు, మహిళలు మొగవాళ్లకు వల వేసి ఈ తతంగం […]

Written By: NARESH, Updated On : June 17, 2021 8:54 am
Follow us on

కరోనా లాక్డౌన్ తో అనేక వ్యాపార సంస్థలు దాదాపు దివాలా తీశాయి. పని లేక పేదలు పస్తులున్నారు. కానీ కొందరు మాత్రం తమ తెలివిని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించారు. అందచందాలను ఆరబోసి యువకులు, ప్రముఖులకు వల వేసి లక్షలకు లక్షలు వారి వద్ద నుంచి వసూలు చేశారు. ఈ మేరకు 72 మంది బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అమ్మాయిలు, మహిళలు మొగవాళ్లకు వల వేసి ఈ తతంగం నడిపించారని బాధితులు పోలీసులకు వివరించారు. అసలు విషయానికొస్తే..

16 నుంచి 60 ప్లస్ వరకు ఇప్పుడు చేతిలో మొబైల్ తో ఉంటున్నారు. సెల్లులో సోషల్ మీడియాతో నిత్యం కనెక్టయి ఉంటున్నారు. ఇందులో కొందరు అమ్మాయిలు, మహిళలు అందంగా కనిపించేసరికి వారితో ఫ్రెండ్షిప్ చేయడం వీలైతే ముందుకు వెళ్లడం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు అమ్మాయిలు పలువురికి రిక్వెస్టులు పంపారు. వీరి అందానికి దాసోహం అయిన యువకులు, ప్రముఖులు వారితో స్నేహం చేశారు. ఆ తరువాత హద్దులు దాటారు.

రాజస్థాన్లోని భరత్ పూర్, హింగోటా, గంగ్ పురి కామా తోడా, దుండాబబుల్ తదితర 20 గ్రామాల్లోని ప్రజలు, హర్యానాలోని 8 గ్రామాలకు చెందిన అమ్మాయిలు, మహిళలు వారి అందమైన ఫొటోలతో కూడా ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ఖాతాలతో ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులకు రిక్వెస్ట్ పంపారు. దీంతో వారి అందానికి పడిపోయిన కొందరు వీరితో కనెక్ట్ అయి లైవ్ కాల్ చేశారు. అంతేకాకుండా అమ్మాయిలను ఇంప్రెష్ చేయాలని వ్యాపారవేత్తలు నగ్నంగా కనిపిస్తూ వారితో సరదా చేశారు.

ఈ వీడియో కాల్ ను రికార్డ్ చేసిన అమ్మాయిలు, ఆంటీలు వాటిని ఆ ప్రముఖులకు పంపి బయటపెడుతామని బెదిరించారు. అయితే తమ పరువు పోతుందని భావించిన కొందరు రూ.50 వేల నుంచి లక్షల వరకు సమర్పించుకున్నారు. ఇలా 72 మంది మోసమోయామని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో కలకలం రేపింది. రాజస్థాన్ కు చెందిన కొందరు అమ్మాయిలు, ఆంటీలు అందంగా ఉండడంతో వారి భర్తలు, ఇతరులు వీరిని పావుగా చేసుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.