
తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు పెట్టింది పేరు. ఎదుటి వారి బలహీనతలు అంచనా వేయడంలో చంద్రబాబు దిట్ట. ఎన్నికల్లో పాటించాల్సిన తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మార్చుకోవడంలో ఆయకు సాటి ఎవరు ఉండరు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాలో ఉన్నారు. దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వ్యూహకర్తన నియమించుకున్నారనే తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీంలో సభ్యుడైన రాబిన్ శర్మను చంద్రబాబు వ్యూహకర్తగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో రాబిన్ శర్మ టీం సర్వేలు కూడా నిర్వహించింది.
వ్యూహాలు అమలు చేయడంలో రాబిన్ శర్మ టీం ఫెయిల్ అయినట్లు సమాచారం. రాబిన్ శర్మ ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయలేదని తెలుస్తోంది. అందుకే టీడీపీ పరాజయం పాలైనట్లు పార్టీ వర్గాలు చెబుతన్నాయి. దీంతో రాబిన్ శర్మతో ఒప్పందం రద్దు చేసుకునేందుకే బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాజకీయ చతురత కలిగిన బాబుకు దిశానిర్దేశం చేసే పని రాబిన్ శర్మ తీసుకున్నా సఫలం కాలేకపోయారని ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు సారధ్యంలోనే టీడీపీ ఎన్నో విజయాలు నమోదు చేసింది. ఆయన నేతృత్వంలోనే రాష్ర్టంలో పార్టీ విజయ పరంపరలు కొనసాగించింది. అయినా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి భంగపడిన బాబు చివరికి తేరుకుని డీల్ రద్దు చేసుకునేందుకు సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. 2024లో ఎలాగైనా పార్టీని విజయతీరాలకు చేర్చాలనే పట్టుదలతో శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించారు.
రాబిన్ శర్మ సలహాలతో టీడీపీ మరింత దిగజారిపోయింది. రాష్ర్టంలో తలెత్తుకోని పరిస్థితి నెలకొంది.దీంతో బాబు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. రాబిన్ శర్మ వ్యూహాల్లో దేవాలయాలపై దాడుల సందర్భంగా చంద్రబాబు పర్యటన చేయాలని సూచించడంతో కొన్ని వర్గాలకు బాబు దూరమయ్యారు. దీంతో ఎన్నికల్లో అపజయం మూటగట్టుకున్నారు. ఫలితంగా పరువు పోయింది. పవర్ పోయింది. దీంతో ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో విజయం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు.