Mohit Sharma Dhurandhar: దురంధర్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా సరే హౌస్ ఫుల్ రన్ తో దుమ్ము రేపుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది దురంధర్.
Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ కథతో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ సినిమా పై కొంతమంది కుహానా లౌకికవాదులు రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికీ వసూళ్ల వేట ఏమాత్రం ఆగడం లేదు.
ఈ చిత్రం ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో వణుకు పుట్టించింది. ఈ సినిమాను అక్కడ బ్యాన్ చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు.
ఈ సినిమాలో రణవీర్ సింగ్ గూడచారి పాత్రలో అద్భుతంగా నటించాడు. పాకిస్తాన్ దేశంలో విస్తరించిన ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి అతడు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. దురంధర్ సినిమాలో ఉగ్రవాదానికి మొగుడి మాదిరిగా నటించాడు రణవీర్.. అయితే రియల్ లైఫ్ లో మాత్రం అసలైన దురంధర్ మేజర్ మోహిత్ శర్మ అని చెప్పవచ్చు.
మోహిత్ శర్మకు.. ఈ చిత్రానికి సంబంధం లేదని దర్శకుడు ఆదిత్య అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ.. ఆ పాత్రకు.. ఈ సినిమాకు అత్యంత దగ్గర సంబంధం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మోహిత్ శర్మ ఎవరు.. అతడు దేశం కోసం ఎలాంటి పనులు చేశాడు.. అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మోహిత్ శర్మ ఇండియన్ ఆర్మీలో హైగ్రేడ్ స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన ఆఫీసర్. ఈయన విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించేవాడు. త్యాగాలకు సైతం వెనుకాడే వాడు కాదు. అందువల్లే ఇతడికి దేశంలోనే అత్యున్నత శౌర్యపురస్కారమైన అశోక చక్ర లభించింది. మోహిత్ 1978 జనవరి 13న హర్యానాలోని రోహ్ తక్ ప్రాంతంలో జన్మించాడు. మోహిత్ తన తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్ శర్మ, సుశీల్ శర్మ కు రెండవ సంతానం. ఇతడు చిన్నప్పుడే బొద్దుగా ఉండడంతో తల్లిదండ్రులు చింటూ అని పిలిచేవారు. 12వ తరగతి పూర్తికాగానే మోహిత్ ఎన్ డి ఏ ఎగ్జామ్ రాశాడు. ఆ సమయంలో అతడికి మహారాష్ట్రలోని గజానన్ మహారాజ్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ లభించింది. అయితే సైన్యంలో చేరాలని ఉద్దేశంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరడానికి ఆసక్తి చూపించాడు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత 1999లో ఆఫీసర్ హోదాలో చేరాడు. అనంతరం ఒకటవ పారా దళంలో చేరి.. అక్కడ అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. రహస్య కార్యకలాపాలలో పాల్గొనేవాడు..
2004లో ఇఫ్తి కార్ భట్ అనే ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూప్లో ప్రవేశించాడు. అందులో ఉంటూనే కింద కీలకమైన సమాచారాన్ని సేకరించాడు. 2009, మార్చి 21న కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్ లో పాల్గొన్నాడు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఆపరేషన్లో ఒక బృందానికి అతడు నాయకత్వం వహించాడు. అంతేకాదు పలువురు ఉగ్రవాదులను అతడు చంపేశాడు. తన తోటి సైనికులను కాపాడాడు. అయితే తీవ్రంగా గాయపడిన అతడు.. కన్ను మూశాడు.
