IPL 2026 Delhi Team Analysis: అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అన్ని సమకూర్చే మేనేజ్మెంట్ ఉంది. అయితే అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ.. ఢిల్లీ జట్టుకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 18 సీజన్లు జరిగాయి. ఒక్కసారి కూడా ఢిల్లీ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. 2020లో మాత్రమే ఢిల్లీ జట్టు ఫైనల్ వెళ్ళగలిగింది. వాస్తవానికి అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఢిల్లీ జట్టు అస్థిరమైన ప్రదర్శన చేస్తూ పరువు తీసుకుంటున్నది.
గట్టి పోటీ ఇస్తుందా..
ఐపీఎల్ లో ఇప్పటి వరకు 18 సీజన్లు జరిగాయి. ఢిల్లీ జట్టు ఆరుసార్లు మాత్రమే లీగ్ దశను దాటగలిగింది. 2019 నుంచి 2021 వరకు మూడుసార్లు ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. ఆ తదుపరి ఒత్తిడికి గురి కావడంతో ఢిల్లీ జట్టు మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక గత నాలుగు సీజన్లలో ఢిల్లీ జట్టు ఆట తీరు అంత గొప్పగా లేదు. ట్రోఫీ ని గెలవడం అటు ఉంచితే.. కనీసం ప్లే ఆఫ్ దాకా కూడా రాలేకపోయింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఆ జట్టులో ఉన్న ప్లేయర్ల ను పరిశీలిస్తే.. ఈసారి కూడా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
గత ఏడాది వరుస విషయాలు
గత ఏడాది వరుస విజయాలు సాధించింది ఢిల్లీ జట్టు.. ఆ తర్వాత లయను కోల్పోయింది. గత ఏడాది జరిగిన వేలంలో కొంతమంది సమర్థవంతమైన ఆటగాళ్లను ఢిల్లీ జట్టు తీసుకుంది. డు ప్లేసెస్.. జెక్ ప్రెజర్ లాంటి ప్లేయర్లను వదిలేసింది. డకెట్.. మిల్లర్.. రాజస్థాన్ నుంచి నితీష్ రానా వంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఈసారి కూడా ఢిల్లీ జట్టుకు ప్రధాన బలంగా రాహుల్.. అక్షర్.. స్టబ్స్.. కులదీప్ యాదవ్.. స్టార్క్ కనిపిస్తున్నారు. ఢిల్లీ జట్టు ఏప్రిల్ 1 లక్నోతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ ద్వారా తన టైటిల్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. హేమాంగ్ బదాని ఢిల్లీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఢిల్లీ జట్టు బలం ఇదే
ఢిల్లీ జట్టు కు ఈ ఏడాది పృథ్వి షా అందుబాటులోకి వచ్చాడు. మూడో స్థానంలో కేఎల్ రాహుల్, మిల్లర్, స్టబ్స్, రానా వంటి ప్లేయర్లు ఢిల్లీ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నారు.. అయితే ఈ జట్టుకు బ్యాటింగ్ కంటే బౌలింగ్ ప్రధాన బలంగా కనిపిస్తోంది. స్టార్క్.. కులదీప్ యాదవ్.. ఎంగిడి.. నటరాజన్ వంటి బౌలర్లు ఢిల్లీ జట్టులో అత్యుత్తమంగా కనిపిస్తున్నారు.. వీరికి తోడు కాశ్మీర్ స్టార్ బౌలర్ అకిబ్ నబి కూడా సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతడిని ఢిల్లీ యాజమాన్యం వేలంలో 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిని బట్టి అతడి సామర్థ్యం మీద ఢిల్లీ జట్టుకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి బలహీనతలు
ఢిల్లీ జట్టు పదేపదే ఓపెనింగ్ జోడిని మారుస్తూ ఉంటుంది. గత సీజన్లో ఇలా చేయడం వల్ల దారుణమైన ఫలితాలను చవిచూసింది ఢిల్లీ జట్టు. పృద్వి.. డకెట్.. నిశాంక.. చెప్పుకునే స్థాయిలో ఫామ్ లో లేరు. స్టార్క్.. ఎంగిడి కనుక బంతితో సత్తా చూపించకపోతే ఢిల్లీ జట్టుకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2025 లో ఢిల్లీ జట్టు ఇలాంటి వైఫల్యాలనే మూట కట్టుకుంది. చివరి ఓవర్లలో సరిగా ఆడ లేకపోవడం.. బౌలర్లు కూడా దారుణంగా పరుగులు ఇవ్వడంతో.. ఢిల్లీ జట్టు మూల్యం చెల్లించుకుంది. మరి ఈసారి ఈ ప్రతికూలతలను ఢిల్లీ జట్టు ఎలా అధిగమిస్తుంది అనేది చూడాల్సి ఉంది.
ఇండియన్ ప్లేయర్లు
కులదీప్ యాదవ్.. కేఎల్ రాహుల్.. కరుణ్ నాయక్.. ముఖేష్ కుమార్.. నటరాజన్.. నితీష్ రానా.. అఖిబ్ నబి.. సాహిల్ ప్రకాష్.. పృద్విషా.. అభిషేక్ పోరల్.. అక్షర్ పటేల్.. సమీర్ రిత్వి.. విప్రజ్.. ఆశతోష్.. విజయ్.. మాధవ్.. నితీష్..
ఫారిన్ ప్లేయర్లు
డేవిడ్ మిల్లర్.. జమీసన్.. ఎంగిడి.. డకెట్.. నిశాంక.. చమీరా.. స్టార్క్.. నిశాంక..
2020లో ఢిల్లీ జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది.. ట్రోఫీ మాత్రమే అందుకోలేకపోయింది.. మరి ఈసారైనా ట్రోఫీ అందుకుంటుందా.. ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇస్తుందా.. ఈ ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లోనే సమాధానాలు లభిస్తాయి.
