AP govt employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతవరకు పీఆర్సీ ప్రకటించకుండా తాత్సారం చేయడంతో వారిలో సహనం నశించింది. దీంతో మంగళవారం నుంచి ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్లు 71 నెరవేర్చాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సీఎం జగన్ ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసేందుకు నిర్ణయించాయి.
ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు చెల్లించాల్సి ఉన్నా జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమయానికి వారికి వేతనాలు అందక తిప్పలు పడుతున్నారు. దీంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక దశలో ప్రభుత్వాన్ని మార్చే శక్తి తమకు ఉందని చెబుతుండటంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా రాజకీయ పార్టీ పెట్టుకోవాలని హితవు పలుకుతుంటే వారిలో మాటల యుద్ధం ఎంత దాకా వెళ్లిందో అర్థమవుతోంది.
ఉద్యోగుల డిమాండ్లలో కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లు ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: అప్పుల కుప్ప: ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతో తెలుసా?
ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇవ్వకుండా తిప్పలు పెడుతోంది. దీంతో వారి బతుకు భారంగా మారుతోంది. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతూ వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా కుటుంబ నిర్వహణ భారంగా మారుతోందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Pawan Kalyan: ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది?