ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట.. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి ఏరిండట అనేవి సామెతలు. దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వచ్చే సంవత్సరం జరగబోయే అయిదు స్టేట్ల ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై ఎత్తులు వేస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా ఆలోచిస్తూ ప్రత్యర్థి పార్టీని చిత్తు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సత్తాపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పాతబస్తీ దాటని పార్టీ యూపీలో సత్తా చాటుతుందా అనే అనుమానాలు సగటు ఓటర్లో వస్తున్నాయి.
యూపీలో ఎస్పీతో పొత్తు కుదిరితే ఎంఐఎం ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంతటి ప్రభావం ఎంఐఎం చూపగలదా? ఆ పార్టీకి అంతటి ఘనత ఉందా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంఐఎం డిమాండ్ ను పక్కన పెడితే అక్కడ దానికి అంతటి ప్రభావం కలుగుతుందా అనే కోణాల్లో పలు విధాలుగా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
దశాబ్దాల పాటు పాతబస్తీ వేదికగానే పోటీ చేస్తూ దేశంలోని పలు స్టేట్లకు విస్తరించాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. యూపీలో ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాలు ఉన్నా అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేంత సత్తా ఎంఐఎం నేతల్లో కనిపించడం లేదు. మత చాందసవాదంతో కొట్టుమిట్టాడే వారు ఓటర్లను ఏ విధంగా తమ వైపుకు తిప్పుకుంటారు.
గతంలో గుజరాత్, బెంగాల్, బీహార్, తమిళనాడు ప్రాంతాల్లో పోటీ చేసినా మహారాష్ర్ట, బీహార్ లో కాస్త బలం చూపించినా మిగతా ప్రాంతాల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. దీంతో ఎంఐఎం పార్టీని నమ్ముకుని సమాజ్ వాదీ పార్టీ పోటీలో పాల్గొంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే అని అందరు నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా యూపీలో 100 సీట్లలో పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని ఎంఐఎం నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండు సార్లు యూపీలో పర్యటించినట్లు చెబుతున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Does mim have that much potential
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com