
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పవన్-రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న ‘పీఎస్.పీకేరానా’ మూవీ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ భారీ మల్టీస్టారర్ పై అభిమానుల్లో బోలెడు అంచనాలున్నాయి.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అయ్యప్పమమ్ కోషియన్’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథా సహకారం అందిస్తుండగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా మేకర్స్ పవర్ స్టార్ పవన్ ‘పోలీస్ గెటప్ లో ’ ఉన్న మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురవాడానికి నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ‘బీమ్లా నాయక్ గా’ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ సెట్ లో రానా ఒక నేరం చేసిన వాడిగా కనిపిస్తుండగా.. పవన్ సీరియస్ పోలీస్ అధికారిగా కనిపించాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నట్టు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు.