Most expensive divorces: ఇప్పటి వరకు చరిత్రలో ఇంత ఖరీదైన విడాకులు చూసి ఉండరు. ఇప్పటి వరకు మనం ఖరీదైన వివాహాలు మాత్రమే చూసి ఉంటాం.. కానీ ఇంత ఖరీదైన విడాకులు మాత్రం చూడడం ఇదే తొలిసారి. పెళ్లంటే నూరేళ్ళ పాటు ఒకరికొకరు సర్దుకు పోతు జీవితాంతం కలిసి ఉండాలి అని ఒకరికొకరు ప్రామిస్ చేసుకునే ఒక బంధం. అయితే ఈ మధ్య చిన్న సమస్యలకు కూడా దంపతులు విడాకుల వరకు వెళ్తున్నారు.
బిల్ గేట్స్, మిలిందా దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. 27 ఏళ్ల వివాహ బంధానికి ఈ ఏడాది మే లో ముగింపు పలికారు. వీరి విడాకులు సంచలనం శ్రీస్టించాయి. విడాకుల సమయంలో వీరిద్దరి ఆదాయం 130 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మీడియా పలు నివేదికల్లో పేర్కొంది. వీరి భరణం గురించి బయటకు రాకపోయినప్పటికీ వీరిది ఖరీదైన విడాకుల జాబితాలో ఖచ్చితంగా చేరుతారని చెబుతున్నారు.
దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ తన భార్య జోర్దాన్ తో విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల సమయంలో కోర్టు అతడికి 5,555 కోట్లు భరణంగా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. వీరిది కూడా ఖరీదైన విడాకుల జాబితాలో చేరిపోయారు.
అమెరికన్ వ్యాపారవేత్త రూపెర్ట్ మర్దోక్, అన్నా మరియా కూడా ఈ ఖరీదైన విడాకుల జాబితాలో ఉన్నారు. విడాకుల సమయంలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లు అందజేసినట్టు తెలుస్తుంది.
ప్రముఖ అమెరికన్ నటుడు మెల్ గిబ్సన్, రాబిన్ మూరె దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. 31 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. అప్పట్లో వీరి సంపద 850 మిలియన్ డాలర్లు గా ఉంది. అయితే వీరి విడాకుల భరణం గురించి అయితే బయటకు రాలేదు. ఇవీ చరిత్రలో నిలిచి పోయే ఖరీదైనా విడాకుల జాబితా..