https://oktelugu.com/

RRR: కొమురం భీమూడో సాంగ్​ ప్రోమో రిలీజ్​.. ఎన్టీఆర్ పై రాజమౌళి ప్రేమ ఎంతో తెలిసింది

RRR: టాలీవుడ్​ టాప్​ మోస్ట్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ర్​ఆర్​ఆర్​. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా వస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను భారీగా ప్లాన్​ చేశారు రాజమౌళి. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఎక్కడికో  వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 12:01 PM IST
    Follow us on

    RRR: టాలీవుడ్​ టాప్​ మోస్ట్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ర్​ఆర్​ఆర్​. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా వస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను భారీగా ప్లాన్​ చేశారు రాజమౌళి. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఎక్కడికో  వెళ్లిపోయాయి.

    ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో ఫుల్ జోరు పెంచారు రాజమౌళి. ఓ వైపు ప్రెస్​మీట్లు, ఈవెంట్లతో ప్రేక్షకులను పలకరిస్తూనే… మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సినిమా అప్​డేట్లు ఇస్తూ మరింత హైప్​ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే మేకోవర్స్ పేరుతో రామ్​, భీమ్​లకు సంబంధించిన వీడియోలు చేయగా.. తాజాగా, రివోల్ట్ ఆఫ్ భీమ్ టైటిల్​తో కొమురం భీమూడో సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు రచన అందించగా.. కాల భైవర ఆలపించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందించారు. ఈ పాటతోనే తారక్​ను ఎలివేట్​ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, డిసెంబరు 24న సాయంత్రం 4 గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నారు.

    కొమురంభీంపై ప్రత్యేకంగా ఒక పాటనే పెట్టారు. మరి అల్లూరిపై కూడా పెట్టారా? లేదా? అన్నది తెలియదు.. ఎన్టీఆర్ కే ఈసాంగ్ ఉంటే మాత్రం అతడిపై రాజమౌళికి ప్రేమ ఎంతుందో దీని ద్వారా అర్థమవుతుంది. మరి అల్లూరిగా రాంచరణ్ పాట ఉంటుందా? ఉండదా? అన్నది క్లారిటీ కావాల్సి ఉంది.

     

    ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్ కనిపించనుండగా.. తారక్​ కొమురం భీమ్​గా దర్శనమివ్వనున్నాడు. అజయ్​ దేవగణ్, శ్రియతో పాటు అలియా భట్​, ఒలివియా మోరిస్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.