Diwali : దివాళీ రోజున బాణసంచా.. తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఉందా??

Diwali : “దివాళీ అంటే టపాసులు.. టపాసులు అంటే దివాళీ. వెలుగుల పండుగ రోజున బాంబుల మోత మోగాల్సిందే. ఎంత ఎక్కువగా మోగిస్తే.. అంత ఘనంగా పండగ చేసుకున్నట్టు లెక్క.” ఇంచుమించు అందరి అభిప్రాయమూ ఇదే. దివ్వెల పండగను కాస్తా.. టపాసుల పండగలా మార్చేశారు. అయితే.. దీనివల్ల ఊహించని రీతిలో కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సాధారణ సమయంలోనే కాలుష్యం సాధారణ స్థాయిని మించిపోతోంది. అలాంటి చోట టపాసులు పేలిస్తే.. అది మరింతగా పెరగడం ఖాయం. అందుకే.. […]

Written By: Bhaskar, Updated On : November 2, 2021 2:07 pm
Follow us on

Diwali : “దివాళీ అంటే టపాసులు.. టపాసులు అంటే దివాళీ. వెలుగుల పండుగ రోజున బాంబుల మోత మోగాల్సిందే. ఎంత ఎక్కువగా మోగిస్తే.. అంత ఘనంగా పండగ చేసుకున్నట్టు లెక్క.” ఇంచుమించు అందరి అభిప్రాయమూ ఇదే. దివ్వెల పండగను కాస్తా.. టపాసుల పండగలా మార్చేశారు. అయితే.. దీనివల్ల ఊహించని రీతిలో కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సాధారణ సమయంలోనే కాలుష్యం సాధారణ స్థాయిని మించిపోతోంది. అలాంటి చోట టపాసులు పేలిస్తే.. అది మరింతగా పెరగడం ఖాయం. అందుకే.. సుప్రీం తీరుపు నేపథ్యంలో.. రాష్ట్రాలు తమ పరిస్థితి అనుసరించి నిర్ణయాలు తీసుకున్నాయి.

ఈ దివాళికి బాణసంచా పేల్చవద్దని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా తప్పదంటోంది. టపాసులు విక్రయించేందుకు ఎవరికి అనుమతి లేదం..టూ ఏకంగా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. టపాసులకు అనుమతి ఇవ్వడమంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని తేల్చి చెప్పింది. 2022 జనవరి ఒకటి వరకు ఢిల్లీలో సేల్స్ అండ్ వాడకంపై మొత్తంగా బ్యాన్ విధించింది.

అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా నిషేధించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు టపాసులకు అనుమతించింది. పంజాబ్ కూడా రెండు గంటల సమయం ఇచ్చింది. హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతంలోని 14 జిల్లాల్లో అన్ని రకాల క్రాకర్స్ అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. క్రాకర్స్ కాల్చొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇక, దక్షిణాది విషయాణికి వస్తే.. కర్నాటక మాత్రం గ్రీన్‌ క్రాకర్స్ కాల్చుకోవచ్చని చప్పింది. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ పాటిస్తూ.. అనుమతి ఉన్న దుకాణదారులే గ్రీన్‌ క్రాకర్స్ విక్రయించాలని చెప్పింది. తమిళనాడు సర్కారు.. బేరియం లవణాలు కలిగిన టపాసుల వినియోగాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్ తప్పదని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ క్రాకర్స్ మాత్రమే వాడాలంటోంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతించింది. థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టపాసులకు బదులు.. గ్రీన్‌ క్రాకర్స్ కాల్చాలని ప్రభుత్వం సూచించింది.

తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్‌లో దీపావళి టపాసులపై ఆంక్షలు విధించారు. శబ్ద కాలుష్యం కలిగించే టపాసుల విక్రయంపై నిషేధం విధిస్తున్నట్టు.. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మార్గదర్శకాలు అమలుచేస్తామని బల్దియా కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ప్రకటించారు.