https://oktelugu.com/

Star Celebrity: కాంగ్రెస్ కార్యకర్తలతో గొడవ పెట్టుకున్న స్టార్ నటుడు.. జోజు జార్జ్‌?

Star Celebrity: దేశంలో రోజురోజుకు ఇంధన ధరలకు రెక్కలు వస్తున్నాయి. రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులకు అధిక భారంగా మారింది. ఈ క్రమంలోనే పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కేరళలోని ఎర్నాకులంలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నిరసనల కారణంగా ఆ ప్రాంతంలో సుమారు ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం […]

Written By: Kusuma Aggunna, Updated On : November 2, 2021 2:01 pm
Follow us on

Star Celebrity: దేశంలో రోజురోజుకు ఇంధన ధరలకు రెక్కలు వస్తున్నాయి. రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులకు అధిక భారంగా మారింది. ఈ క్రమంలోనే పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కేరళలోని ఎర్నాకులంలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నిరసనల కారణంగా ఆ ప్రాంతంలో సుమారు ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న స్టార్ నటుడు జోజు జార్జ్ రెండు గంటలపాటు ట్రాఫిక్ లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన అతను ఏకంగా రోడ్డుపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై వాగ్వాదానికి దిగారు. పెరుగుతున్న డీజిల్ ధరలకు నిరసనలు తెలపాలి కానీ తెలిపే విధానం ఇది కాదని ఆయన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఇలా నిరసనలు తెలిపితే ప్రజలకు ఎన్నో అంతరాయాలు ఏర్పడతాయని దారిలో ఎంతో మంది అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్లేవారు ఉంటారని ఆయన వారితో గొడవ పడ్డారు.

దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా అతని కారుపై దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరసన తెలియచేసే విధానం ఇది కాదని వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మద్యం సేవించి మహిళా కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారని వాదించడంతో ఈ గొడవ అనంతరం జోజు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా అతను మద్యం సేవించలేదని తేలింది దీంతో జూజు మాట్లాడుతూ.. ఈ గొడవ ఇంతటితో ముగిసిపోవాలని కోరారు.