TDP: తెలుగుదేశం పార్టీ ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. పార్టీలో కోవర్టుల సంఖ్య పెరుగుతోందని గుర్తిస్తున్నారు. దీంతోనే పార్టీ పరాజయం పాలైందని నిర్ణయానికి వస్తున్నారు. పార్టీని సరైన మార్గంలో నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కోవర్టులను ఏరివేయాలని భావిస్తున్నారు. ఇక ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. అధికార పార్టీకి భయపడి కొందరు నేతలు వారికి అనుకూలంగా పనిచేసి పార్టీ పరాజయానికి కారకులైనట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పంలో పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పార్టీ ఓటమికి గల కారణాలపై అన్వేషణలు చేస్తున్నారు. పార్టీలో ఎంతమంది కోవర్టులు ఉన్నారు? వారిని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలి? వినకుంటే ఏం చేయాలి? అనే వాటిపై చర్చించారు. కార్యకర్తలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ మరణం తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు, దగ్గుబాటి ఇలా కలిశారు
అధికార పార్టీ వైసీపీ నేతల బెదిరింపులతోనే టీడీపీ నేతలు భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేతలకు ధైర్యం చెప్పి వారి మనోబలం పెంచే పనిలో పడిపోయారు. అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీలో కూడా భవిష్యత్ ఉంటుందని చెబుతూ వారిని దారికి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
చెప్పినట్లు వినకపోతే కేసులు పెడుతూ జైళ్లకు పంపిస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో టీడీపీ నేతలు కొంత భయాందోళన చెందుతూ పార్టీకి సరిగా పనిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అపజయం కలిగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నిలపాలంటే కేడర్ ను సరైన దారిలో పెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వారిలో నూతనోత్తేజం నింపాలని చూస్తున్నారు.
Also Read: చంద్రబాబు టీడీపీని కుప్పంలో గట్టెక్కిస్తారా?