https://oktelugu.com/

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్‌ శాటిలైట్‌ రైట్స్‌ కు భారీ డీల్…

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. నానికి జోడీగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నటిస్తున్నారు. ‘ట్యాక్సీవాలా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నాని నటించిన గత చిత్రాలు ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ రెండూ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ప్రేక్షకులను […]

Written By: , Updated On : December 11, 2021 / 10:45 AM IST
Follow us on

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. నానికి జోడీగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నటిస్తున్నారు. ‘ట్యాక్సీవాలా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నాని నటించిన గత చిత్రాలు ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ రెండూ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఈ మూవీ పైనే నాని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

nani shyam singaroy movie satelite rights sold for high price

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమాను నిర్మిస్తుండగా… నాని వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను రూ. 10 కోట్లకు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ దక్కించుకుందట. కాగా శాటిలైట్ హక్కుల పరంగా పరంగా నాని సినిమా కెరీర్‌లో ఇదే రికార్డ్‌ డీల్‌ అంటున్నారు. ఇక ఇటీవల విడుదలైన సిరివెన్నెల చివరి పాటకు యూట్యూట్‌లో అద్భుతమైన స్పందవ వస్తోంది. కాగా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈనెల 14న వరంగల్‌లోని రంగలీల మైదానంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రాయల్‌ ఈవెంట్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. మరి ఈ మూవీ అయిన నానికి విజయం అందిస్తుందో లేదో చూడాలి.