International Mountain Day 2021: ప్రకృతి మనకు ఎన్నో వనరులు ఇచ్చింది. గాలి, నీరు, సముద్రాలు, పర్వతాలు, అడవులు, నదులు, మైదానాలు ఒకటేమిటి ఎన్నో అందుబాటులో ఉంచింది. కానీ మన సాంకేతికత పెరగడంతో మనమే వాటిని నాశనం చేస్తున్నాం. ప్రతి దాన్ని చెడగొడుతూ మన పతనం మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకు నదులను కాలుష్యం కోరల్లో చిక్కుకునేలా వ్యర్థాలతో నింపేస్తున్నాం. దీంతో పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతోంది. ఇంకా పర్వతాలను సైతం పిండి చేసేస్తున్నాం. ఫలితంగా భూమి ఎడారిగా మారనుంది.

మన దేశంలో గ్రానైట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారి పర్వతాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. గుట్టలన్ని కరిగిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టితో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తన్నాం. దీంతో భవిష్యత్ అంధకారమే అని తెలుస్తున్నా ఎవరికి కూడా పట్టింపు లేదు.

ఒకప్పుడు ఎటు చూసినా గుట్టలతో అలరారే మన ప్రకృతి నేడు వాటిని ఇక పుస్తకాల్లోనే చదువుకునే వీలు కలిగే సూచనలున్నాయి. ఇతర దేశాల్లో కూడా పర్వతాలున్నా వారు వ్యాపారాలు చేయడం లేదు. దీంతో అక్కడ వాటిని సంరక్షించుకుంటున్నారు. కానీ మన దేశంలో స్వార్థమే అన్నింటికి మూలం కావడంతో గుట్టలపై వ్యాపారాలు చేస్తూ మన ప్రకృతిని నామరూపాల్లేకుండా చేస్తున్నారు. ఎటు చూసినా ఎడారిని తలపించే విధంగా గుట్టలు మాయమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తూ గుట్టలను గుటకాయ స్వాహా చేస్తున్నారు.
ప్రకృతి ప్రసాదించిన ప్రసాదాన్ని అందరికి అందేలా చూడాల్సిన బాధ్యత మనమీదే ఉన్నా ఎవరికి కూడా పట్టింపు లేదు. దీంతో రోజురోజుకు గుట్టలు కనిపించకుండా పోతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా స్వార్థంతో వ్యాపారులు తమ ఆదాయం కోసం తవ్వేస్తున్నారు. దీంతో జంతుజాతి కూడా నశించిపోతోంది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు తదితర జంతువులు జనావాసాల వైపు వెళ్లే అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో గుట్టలను మాయం చేస్తున్న వారిపై ప్రభుత్వం, ప్రజలు వ్యతిరేకించి సహజ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఏయే దేశాల్లో చెల్లుబాటు అవుతుందో మీకు తెలుసా?
వాతావరణ మార్పులు కూడా మనల్ని భయపెడుతున్నాయి. ఇటీవల ఏపీలో వరదలు కూడా ఇందులో భాగమే అని గుర్తుంచుకోవాలి. ఇలా మనకు ఎన్ని హెచ్చరికలు వస్తున్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతోనే మన పతనం మనమే కొనితెచ్చుకుంటున్నాం. నేడు ప్రపంచ పర్వతాల దినోత్సవం సందర్భంగా మనకు కనువిప్పు కలగాలి. ప్రకృతిని ఆరాధించాలే కానీ నాశనం చేయకూడదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2020 ఇంటర్నేషనల్ మౌంటెన్ డేకు థీమ్ గా పర్వతాలపై కనిపించే జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఈ థీమ్ ను తీసుకొచ్చింది. 1992 నుంచి పర్వతాల ప్రాముఖ్యతపై పర్యావరణ సదస్సులు నిర్వహించడం ప్రారంభించారు. తరువాత 2002 సంవత్సరాన్ని పర్వతాల పరిరక్షణ దినోత్సవంగా గుర్తించారు. 2003 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న పర్వతాల పరిరక్షణ గా పాటిస్తున్నారు.
Also Read: రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు చెల్లించాల్సిందే?