ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలోనూ రోజుకు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉండటం భారతీయులకు కొంత ఊరటనిచ్చే అంశం. Also Read: గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..! దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణే, […]

Written By: Neelambaram, Updated On : July 25, 2020 3:35 pm
Follow us on


కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలోనూ రోజుకు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉండటం భారతీయులకు కొంత ఊరటనిచ్చే అంశం.

Also Read: గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తొలినాళ్లలో ముంబై, ఢిల్లీ రాష్ట్రాలు పోటాపోటీగా పాజిటివ్ కేసుల్లో పోటీపడ్డాయి. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉండగా ఢిల్లీ మాత్రం కరోనాను జయించే దిశగా వెళుతోంది. దేశంలో ఆన్ లాక్ 2.0లో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండగా ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు తగ్గముఖం పడుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పడిపోతుంది. ఒకద‌శ‌లో ఏకంగా ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసుల‌తో ఆందోళన కలిగించిన ఢిల్లీ కొద్దిరోజుల్లో కరోనా రహిత రాష్ట్రంగా మారబోతుంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం ఢిల్లీలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య ల‌క్షా27వేల వ‌ర‌కు చేరింది. అయితే వీరిలో దాదాపు ల‌క్షా 10వేల మంది కరోనా నుంచి రికవరీకాగా 3,745మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,554 ఉన్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో దాదాపు వెయ్యి కొత్త కేసులు న‌మోదుకాగా 1400మంది రికవరీ అయ్యారు. ఈలెక్కన యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూపోతుంది. ప్ర‌స్తుతం ఉన్న 14వేల యాక్టివ్ కేసుల్లో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నవారు 4వేలమందికాగా మిగతా వారంగా స్వల్ప లక్షణాలతో హోంక్వారంటైన్లో ఉన్నారు. దీంతో ఆస్పత్రుల్లో ఉన్నవారు రికవరీ అయితే ఢిల్లీ క‌రోనా మహమ్మరిపై విజయం సాధించినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

అయితే కరోనాపై ఢిల్లీ విజయం సాధించడానికి ప్రధాన కారణంగా ప్లాస్మా థెరపీ అని తెలుస్తోంది. కరోనా బాధితులకు ఢిల్లీలో ఫ్లాస్మా థెరిపీ చేస్తుండటంతో రోగులంతా త్వరగా కోలుకుంటున్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారు సైతం ప్లాస్మా దానం చేసేందుకు పెద్దసంఖ్యలో ముందుకొస్తుండటం కూడా ఒక కారణమని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందనే ఆశాభావాన్ని ఢిల్లీవాసులు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయోగాలు చేస్తే కరోనా బాధితులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా థెరపీకి ముందుకొస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!