పద్మం వికసించని నవరస నట సార్వభౌముడు !

కైకాల సత్యనారాయణ.. ఆయనొక నటసార్వభౌమ నవరసాల నటచక్రవర్తి.. నటనలో గొప్ప హుందాతనం, స్వరంలో ఘనమైన గాంభీర్యం.. మాటల్లో స్పష్టమైన తెలుగుతనం.. కర్కశమైన విలనిజానికి.. అలాగే భార్యకు భయపడే అతిసాధారణ భర్తగా.. యముడిగా.. నరకాసురుడిగా, రావణుడిగా, కీచకుడిగా, ఒక ఊరు పెద్దగా, మహాశివుడులో పరమ భక్తుడిగా ఇలా అనేక రకాలుగా సమస్త దక్షిణ భారత ప్రేక్షకుల ముందు ఒక గొప్ప నటుడిగా ప్రత్యక్షమయ్యే ఆ నట సార్వభౌముడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆ మహా నటసార్వభౌముడికి జన్మదినం […]

Written By: admin, Updated On : July 25, 2020 4:13 pm
Follow us on


కైకాల సత్యనారాయణ.. ఆయనొక నటసార్వభౌమ నవరసాల నటచక్రవర్తి.. నటనలో గొప్ప హుందాతనం, స్వరంలో ఘనమైన గాంభీర్యం.. మాటల్లో స్పష్టమైన తెలుగుతనం.. కర్కశమైన విలనిజానికి.. అలాగే భార్యకు భయపడే అతిసాధారణ భర్తగా.. యముడిగా.. నరకాసురుడిగా, రావణుడిగా, కీచకుడిగా, ఒక ఊరు పెద్దగా, మహాశివుడులో పరమ భక్తుడిగా ఇలా అనేక రకాలుగా సమస్త దక్షిణ భారత ప్రేక్షకుల ముందు ఒక గొప్ప నటుడిగా ప్రత్యక్షమయ్యే ఆ నట సార్వభౌముడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆ మహా నటసార్వభౌముడికి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుందాం.

Also Read: పవన్ కళ్యాణ్, ట్రాప్ లో పడకండి

పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన ఈ నవరసాల మేటి నటుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నటనలో ఆయనొక శిఖ‌రం, కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.. ఇంకా అలరిస్తూనే ఉన్నారు. కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో 1935 జూలై 25న పుట్టారు. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య కూడా గుడివాడలోనే సాగింది. గుడివాడ కళాశాల నుండే ఆయన పట్టభద్రుడయ్యారు. ఆయన 25వ ఏట నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇక కైకాల భారత పార్లమెంటు సభ్యుడుగా కూడా పనిచేయడం విశేషం. ఇప్పటిదాకా కైకాల దాదాపు 779 సినిమాల్లో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపదలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రతినాయక పాత్రల్లో అరితేరిపోయిన ఒక నటుడు, హాస్య పాత్రల్లో కూడా అద్భుతంగా రాణించడం అంటే గొప్ప అసాధారణమైన ప్రతిభే. అయితే మన సౌత్ సినీ పరిశ్రమలు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదనే అనుకోవాలి. అంతటి మహానుభావుడికి ఇంకా పద్మశ్రీ లాంటి అవార్డ్ లు రాకపోవడం మన తెలుగు ప్రేక్షకులు చేసుకున్న దురదృష్టం.

Also Read: హాట్ బ్యూటీకి పోలీస్ క్యారెక్టర్ !

నిజానికి కైకాలగారి కంటే చాల జూనియర్స్ అయిన మోహన్ బాబు, బ్రహ్మానందం లాంటి నటులకు కూడా పద్మశ్రీలు ఇచ్చి.. ఇంకా ఈ విశ్వ నటసార్వభౌముడికి ఇవ్వకపోవడం పద్మశ్రీ లాంటి ఉన్నతమైన అవార్డులు చేసుకున్న దౌర్భాగ్యమే. ఆ అవార్డ్ ల స్థాయిని తగ్గించడమే. అయినా కైకాల సత్యనారాయణ గాంభీర్యం, ఆయన విలక్షణ పోషణ ముందు, ఆయన అసమాన నటనా కౌశలం ముందు ఎంతగొప్ప అవార్డ్ అయిన అతి సాధారణమైనదే.