https://oktelugu.com/

నా కొత్త మూవీ టైటిల్ ని‌ గెస్‌ చేయండి: ఆదా శర్మ

పూరి జగన్నాథ్‌ టాలీవుడ్‌కు పరిచయం చేసిన ముంబై హీరోయిన్లలో ఒకరు ఆదా శర్మ. మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆదా.. 2013లో పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘హార్ట్‌ ఎటాక్‌’లో నితిన్‌కు జోడీగా తెలుగులో తెరంగేట్రం చేసింది. తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్‌, గరం, క్షణం లాంటి సినిమాల్లో నటించినా.. తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో మళ్లీ హిందీ సినిమాల బాట పట్టింది. కమాండో 2, కమాండో, బైపాస్‌ రోడ్‌ వంటి మూవీస్‌లో నటించింది. రెండు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 / 05:23 PM IST
    Follow us on


    పూరి జగన్నాథ్‌ టాలీవుడ్‌కు పరిచయం చేసిన ముంబై హీరోయిన్లలో ఒకరు ఆదా శర్మ. మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆదా.. 2013లో పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘హార్ట్‌ ఎటాక్‌’లో నితిన్‌కు జోడీగా తెలుగులో తెరంగేట్రం చేసింది. తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్‌, గరం, క్షణం లాంటి సినిమాల్లో నటించినా.. తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో మళ్లీ హిందీ సినిమాల బాట పట్టింది. కమాండో 2, కమాండో, బైపాస్‌ రోడ్‌ వంటి మూవీస్‌లో నటించింది. రెండు వెబ్‌ సిరీస్‌లు కూడా చేసింది. మధ్యలో తమిళ్‌లో కూడా అడుగుపెట్టిన ఆమె సీనియర్ హీరో రాజశేఖర్ సరసన కల్కితో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్‌ ఇయర్ రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

    Also Read: పవన్ కళ్యాణ్, ట్రాప్ లో పడకండి

    కానీ, ఈ మధ్య ఆమె చేతిలో వేరే సినిమాలేమీ లేవు. దాంతో, ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు అందాల ట్రీట్‌ ఇచ్చింది. అదే టైమ్‌లో దర్శక, నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. దానికి ఫలితం దక్కినట్టుంది. ఓ తెలుగు ప్రాజెక్ట్‌ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో వెరైటీగా పంచుకుంది ఆదా. తాను ఓ తెలుగు సినిమాకు సంతకం చేశానని చెప్పిన ముంబై భామ చేతిలో స్క్రిప్టు పట్టుకుని తెగ సంతోషంగా ఉన్న ఫొటోలనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీనరీ ఉన్న ఫొటోలు, ఒక చోట ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్న మరో ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు.. ఈ మూవీ హీరో, టైటిల్‌ ఏంటో గెస్‌ చేయండి అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది. అందుకు కొన్ని హింట్స్‌ కూడా ఇచ్చింది.

    Also Read: హిట్ లేకపోయినా ఎమ్మెల్యే కూతుర్ని పట్టాడు !

    ‘నా నెక్ట్స్‌ తెలుగు ఫిల్మ్‌కు సైన్‌ చేశా. నా సినిమాలో హీరోకు సంబంధించిన కొన్ని ఫొటోలివి (కొన్ని ఫొటోల్లో హీరో లేడు. కానీ, వెనకాల పచ్చదనం ఉండడం నచ్చి పోస్ట్‌ చేశా). కావాలంటే చివరి ఫొటోను జూమ్‌ చేసి చూడండి… నా నుదిటిపై ఉన్న స్పైడర్ (సాలె పరుగు) కూడా సినిమాలో ఓ క్యారెక్టరే. ఇది ఎలాంటి సినిమానో మీరు ఊహించగలరా?’ అని రాసుకొచ్చింది. దానికి #100yearsofAdahSharma #1920to2020 #theresacluehiddeninthecaption. అనే హ్యాష్ ట్యాగ్‌లను జత చేసింది. అందులో సినిమా టైటిల్‌ ఉంది గెస్‌ చేయండి అని ఆదా రాసుకొచ్చింది. కాసేపటికే తన నుదిడిపై స్పైడర్ను జూమ్‌ చేసిన ఫొటోను కూడా షేర్ చేసిన ఆదా.. అది నిజమైన స్పైడర్ అని చెప్పింది. కానీ, మూవీ టైటిల్‌ స్పైడర్ కాదు అని స్పష్టం చేసింది. దాంతో, మూవీ పేరు ఏంటా? అని ఫ్యాన్స్‌ ఆలోచనలో పడ్డారు. అయితే, విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నమలై లాస్ట్‌ ఇయర్ అనౌన్స్‌ చేసిన మూవీలో ఆదా శర్మ చాన్స్‌ కొట్టేసిందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. తమిళ్‌, తెలుగు భాషల్లో ప్లాన్‌ చేసిన ఈ మూవీలో మాళవికా మోహనన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ, ఈ మూవీ పట్టాలెక్కలేదు.

    Tags