Arvind Kejriwal: తీహార్ జైల్లో ‘క్రేజీ’ డ్రామా జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. టైప్–2 డయాబెటిస్ పేషెంట్ అయినా కనీసం ఇన్సూలిన్ కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు కేజ్రీవాల్ ౖజñ లు నుంచి బయటకు రావడానికి షుగర్ పెంచుకుంటున్నారని, ఇందు కోసం మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని, ఆలు పూరి తింటున్నారని, చక్కెరతో టీ తాగుతున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఆప్ నేతలు, ఈడీ మధ్య తలెత్తిన వివాదం అనేక ప్రశ్నలకు కారణమైంది. ఈ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
కేజ్రీవాల్ వాదన ఇలా..
తన ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలని కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని కోరారు. చిన్నచిన్న విషయాలను ఈడీ రాజకీయం చేస్తోందని కోర్టుకు తెలిపారు. జైలులో గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. డాక్టర్‌తో నిత్యం 15 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. తానేమైనా గ్యాంగ్‌స్టర్‌నా అని ప్రశ్నించారు. షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తోందని, తన ఆహారం మెనూ డాక్టర్ వద్ద ఉందని తెలిపారు. 20212 నుంచి తాను 50 యూనిట్ల ఇన్సూలిన్ తీసుకుంటున్నట్లు చెప్పారు. 29 రోజులుగా ఇన్సూలిన్ ఇవ్వడం లేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటానా అని ప్రశ్నించారు. షుగర్ పెరగడానికి ఇన్సూలిన్ ఇవ్వకపోవడమే కారణమని తెలిపారు.
ఈడీ వాదన ఇలా..
ఈడీ మాత్రం కేజ్రీవాల్ కావాలనే షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని ఆరోపించింది. మామిడి పండ్లు, గోధుమ పిండి, చక్కెరతో చేసిన మిఠాయిలు తింటున్నారని, టీ తాగుతున్నారని తెలిపింది. కేజ్రీవాల్ తింటున్న ఆహారానికి, డైట్ చార్ట్‌కు సరిపోలడం లేదని కోర్టుకు విన్నవించింది. కేజ్రీవాల్‌ను చూసుకోవడానికి కోర్టులో వైద్య బృందాలు ఉన్నాయని తెలిపింది. కేజ్రీవాల్ డైట్‌లో తీపి పదార్థాలు లేకుండా చూడాలని కోరింది. అయితే తాను 48 రోజులుగా జైల్లో ఉంటున్నానని కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే తిన్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆలూ పూరి కూడా ఒక్కసారి మాత్రమే తిన్నానని తెలిపారు.
కోర్టు ప్రశ్నలు..
ఇక న్యాయస్థానం కేజ్రీవాల్‌కు ప్రశ్నలు వేసింది. భోజనం మెనూలో ఎందుకు మార్పు చేశారని అడిగింది. ఆహారం మార్చడానికి కారణం ఏంటని ప్రశ్నించింది. వైద్య పరీక్షల వివరాలు కూడా ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.