Aadhaar: అధార్‌పై డిబేట్‌.. ఇక విదేశీయులకూ జారీ… కొత్త నిర్వచనం చెప్పిన ఉడాయ్‌!

కేంద్రం ఇప్పటి వరకు ఆధార్‌ కార్డును భారతీయులకు మాత్రమే జారీ చేసింది. ఇకపై భారత పౌరులు కానివారికి కూడా ఇవ్వాలని నిర్ణయించిందని భారత విశిష్ట్‌ గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : July 7, 2024 2:04 pm

Aadhaar

Follow us on

Aadhaar: మన దేశంలో అన్ని పథకాలకూ ఆధార్‌ తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలతో సంబంధం లేకుండా ఆధార్‌ను తప్పనిసరి చేశారు. కోర్టులు ఆధార్‌ తప్పనిసని కాదని చెబుతున్నా.. ఆ ఆదేశాలను అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వాలు కూడా పుట్టిన బిడ్డకు కూడా ఆధార్‌ జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్‌పై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది.

విదేశాల్లోన్నవారికీ ఆధార్‌..
కేంద్రం ఇప్పటి వరకు ఆధార్‌ కార్డును భారతీయులకు మాత్రమే జారీ చేసింది. ఇకపై భారత పౌరులు కానివారికి కూడా ఇవ్వాలని నిర్ణయించిందని భారత విశిష్ట్‌ గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) తెలిపింది. ఆధార్‌ కార్డు పొందాలంటే.. ఆ వ్యక్తి కచ్చితంగా భారతీయులే అయి ఉండాల్సిన పనిలేదు. విదేశాలకు చెందిన వారికీ జారీ చేస్తామని ఉడాయ్‌ ప్రకటించింది.

అన్నింటికీ లింగ్‌..
భారతీయలందరికీ ఆధార్‌ కార్డు ఉంది. దీంతో తాము భారతీయులం అని చెప్పుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ తప్పనిసని చేస్తున్నాయి. ఇక మొబైల్‌ నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్లు, పాన్‌ నంబర్లు ఇలా అన్నింటికీ ఆధార్‌ లింక్‌ అయి ఉండటంతో ఆధార్‌ అనేది భారతీయులకు మాత్రమే అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఉడాయ్‌ కొత్త నిర్వచనం చెప్పింది. ఆధార్‌ కార్డుకు భారత పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన నాన్‌ రెసిడెంట్లు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆధార్‌ కార్డులు జారీ చేస్తామని ఉడాయ్‌ ప్రకటించింది.

కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌..
ఇదిలా ఉంటే విదేశీయులకూ ఆధార్‌ జారీ చేయవచ్చని కోల్‌కత్తా హైకోర్టుకు ఉడాయ్‌ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో చాలా ఆధార్‌ కార్డులను ఒక్కసారిగా డీయాక్టివేట్‌ చేసి, తిరిగి యాక్టివేట్‌ చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ జాయింట్‌ ఫోరం ఎగెనెస్ట్‌ ఎన్‌ఆర్‌ఐ సంస్థ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ శివజ్ఞానం, జస్టిస్‌ హరణ్మయ్‌ భట్టాచార్యల ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఏమైందంటే..
ఒక వ్యక్తి ఆధార్‌ కార్డును కోల్‌కతా అధికారులు ఇటీవల డీయాక్టివేట్‌ చేశారు. ఎందుకు అని అడిగితే.. మీరు విదేశీయులు, భారతీయులు కాదు అని తెలిపారు. దీంతో ఆ వ్యక్తి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. ఆధార్‌ నిబంధనల్లోని 28ఏ, 29 నిబంధనల ప్రకారం.. విదేశీయులకు కూడా ఆధార్‌ చెల్లుతుంది అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాధించాడు. దీనిపై ఉడాయ్‌ వాదనను హైకోర్టు విన్నది. పిటిషనర్‌ చెప్పినట్లు ఆధార్‌ కార్డు పొందాలంటే భారతీయులు అయి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయులు కాని వారు ప్రభుత్వ రాయితీలు పొందాల్సి వస్తే నిర్దేశిత కాలపరిమితితో ఆధార్‌ జారీ చేయవచ్చని ఉడాయ్‌ తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు.