Homeజాతీయ వార్తలుAmit Shah: అన్నదాతలు.. ఆడ పడుచులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. మీరు...

Amit Shah: అన్నదాతలు.. ఆడ పడుచులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. మీరు తెలుసుకోండి!

Amit Shah: కేంద్రంలోని నరేంద్రమోదీ 3.0 ప్రభుత్వం అన్నదాతలకు, ఆడ పడుచులకు శుభవార్త చెప్పింది. దీంతో చాలా మందికి ఊరట లభించనుంది. ఇంతకీ కేంద్రం చేసిన ప్రకటన ఏమిటి.. ఎవరికి లబ్ధి కలుగుతుంది.. అర్హతలు ఏమిటీ అనే విషయాలు తెలుసుకుందాం.

జిల్లాకో కోఆపరేటివ్‌ బ్యాంక్‌..
దేశంలోని ప్రతీ జిల్లాలో ఒక సహకార బ్యాంకు(కోఆపరేటివ్‌ బ్యాంకు), పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో మల్టీపర్పస్‌ ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీలను( పీఏసీఎస్‌ ) ఏర్పాటు చేస్తామని తెలిపారు.

2 లక్షల పంచాయతీలు సహకారానికి దూరం…
దేశవ్యాప్తంగా సహకారం సంస్థ లేని పంచాయతీలు 2 లక్షలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. 102వ అంతర్జాతీయ సహకార దినోత్సవం పురస్కరించుకుని సహకార్‌ సే సమృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నానో యూరియా, నానో డీఏపీపై 50 శాతం సబ్సిడీని ప్రకటించిన గుజరాత్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామాల్లో సహకారమే కీలకం..
గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో సహకారరంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో సహకార బ్యాంకు, జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ లేకుండా ఏ రాష్ట్రం, జిల్లా ఉడకుడదని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల పంచాయతీల్లో మల్టీపర్సస్‌ పీఏసీఎస్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

త్వరలో జాతీయ సహకార విధానం..
జాతీయ సహకార విధానం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. 1,100 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేశామని చెప్పారు. రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్ల జారీతో మరిన్న సహకార సంస్థల సంక్షేమం కోసం నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పనిచేస్తుందని తెలిపారు.

ఆర్గానిక్‌ సాగు పెంచేలా..
సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేసేందుకు రైతులకు సరైన ధర అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిందని వివరించారు. ఇక రైతుల జీవితాలను సుసంపన్నం చేసేందుకు కేంద్రం ఆర్గానిక్‌ కమిటీ, ఎక్స్‌పోర్ట్‌ కమిటీ, సీడ్‌ కమిటీ అనే మూడు బహుళ, రాష్ట్ర సహకార సంస్థలను కూడా ఏర్పాటు చేసిందని అమిత్‌షా తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version