London: భారతీయులు.. లండన్ లోనూ పండుగ చేశారు.. తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌ వార్షికోత్సవ సంబరాలివీ

లండన్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌ వార్షికోత్సవాన్ని 2017 నుంచి నిర్వహిస్తున్నారు. అదే ఏడాది ఈ సంస్థన స్థాపించారు. లండన్‌లో నివసిస్తున్న తెలుగు, హిందూ కుటుంబాలను ఏకం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేశారు.

Written By: Raj Shekar, Updated On : July 7, 2024 1:58 pm

London

Follow us on

London: లండన్‌లో యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌ 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జూన్‌ 29న లండన్‌లోని హోర్‌ ప్రాంతంలోని హచ్‌ ఎండ్‌ హైస్కూల్‌ ఇందుకు వేదికైంది. తెలుగు, హిందూ సమాజ వారసత్వ, సాంస్కృతిక విలువల పరిరక్షణే లక్ష్యంగా ఐక్యతను పెంపొందించేందుకు ఏటా వేడుకలు నిర్వహిస్తున్నారు.

2017 నుంచి..
లండన్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌ వార్షికోత్సవాన్ని 2017 నుంచి నిర్వహిస్తున్నారు. అదే ఏడాది ఈ సంస్థన స్థాపించారు. లండన్‌లో నివసిస్తున్న తెలుగు, హిందూ కుటుంబాలను ఏకం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేశారు. తాజా వేడుకల్లో భాగంగా 6 బృందాలు రామాయణంలోని సన్నివేశాలపై ప్రదర్శించిన స్కిలట్‌లు ఆకట్టుకున్నాయి. బాల బాలికలు రామాయణంలోని పలు పాత్రల గురించి వివరించారు. కీలక పాత్రలు, వారి ప్రాధాన్యతను తెలియజేశారు.

భారీగా హాజరైన తెలుగు, హిందువులు..
ఇక ఈ వార్షికోత్సవానికి ఇంగ్లండ్‌లోని తెలుగువారు, హిందువులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మన సంస్కృతిని చాలేటా నిర్వహించిన కార్యక్రమాలను వీక్షించారు. అందరూ కలిసి ఉత్సాహంగా గడిపారు. కొత్తవారి పరిచయ కార్యక్రమం నిర్వహించారు.