Hit 3 : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇది కేవలం యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా కావడం తో, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఆదరణ కరువు అయ్యింది. ఫలితంగా ప్రతీ రోజు డ్రాప్స్ ని సొంతం చేసుకుంటూ వచ్చింది ఈ చిత్రం. లాంగ్ వీకెండ్ తర్వాత సోమవారం రోజున ఈ చిత్రం దాదాపుగా 70 శాతం కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇది బయ్యర్స్ కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కానీ లాంగ్ వీకెండ్ లోనే 90 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం తో ఎవరికీ ఎలాంటి నష్ట సూచనలు రాలేదు.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
నిన్నటితో ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, నిన్నటితో 51 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 97 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఈరోజుతో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవచ్చు. అదే కనుక జరిగితే మీడియం రేంజ్ హీరోలలో మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ఏకైక హీరో గా నాని సరికొత్త చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం లో ఆరు రోజులకు గాను 14 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నిర్మాత దిల్ రాజు నైజాం ప్రాంతం హక్కులను 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు.
అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 4 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 21 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 85 లక్షలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 34 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 5 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 3 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ ప్రాంతం లో ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాల్సి ఉంది. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇతర భాషల్లో కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?