Retro : చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు తయారైంది తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) ‘రెట్రో'(Retro Movie) మూవీ పరిస్థితి. గత ఏడాది సూర్య నుండి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కంగువా’ చిత్రం కనీసం 40 శాతం కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేక ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘రెట్రో’ చిత్రానికి మొదటి రోజు వచ్చిన టాక్ ని చూసి, ఈ సినిమా అంతకు మించిన డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంత పెద్ద ఫ్లాప్ మాత్రం అవ్వలేదు కానీ, ఓవరాల్ గా కమర్షియల్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఆరు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 50 శాతానికి పైగా బిజినెస్ ని రికవర్ చేసింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి 70 శాతం వరకు బిజినెస్ రికవర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!
5వ రోజున దాదాపుగా 6 కోట్ల 45 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, బయ్యర్స్ లో ఒక సరికొత్త ఊపుని తీసుకొచ్చింది. వర్కింగ్ డే అయినప్పటికీ ఇంత వసూళ్లు వచ్చాయంటే, కచ్చితంగా ఫుల్ రన్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆరవ రోజున దాదాపుగా 50 శాతం డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. అంటే కేవలం 3 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రం 40 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అధిగమించింది. అదే విధంగా ఓవర్సీస్ లో 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక నుండి పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక సూర్య కి కంచు కోటగా పిలవబడే కేరళ ప్రాంతంలో ఈ చిత్రానికి 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో కచ్చితంగా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 83 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 41 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫ్లాప్ టాక్ తో ఇది చాలా డీసెంట్ లాంగ్ రన్ అనే చెప్పొచ్చు. ‘కన్నిమ్మ’ పాట పెద్ద హిట్ అవ్వడం అందుకు కారణం అయ్యుండొచ్చు. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!