Operation Sindoor: జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేపట్టిన యుద్ధం వల్ల పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.. బహవల్పూర్ ప్రాంతం నుంచి కోట్లి వరకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను అమలు చేసింది.. బహ వల్ పూర్ నుంచి కోట్లి వరకు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారత ఆర్మీ మొదటి నుంచి అనుమానిస్తోంది.. భారత ఆర్మీ అనుమానానికి తగ్గట్టుగానే ఇంటిలిజెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి భారత సైన్యం తన పని మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన పహల్గాం దారుణంలో పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపుకు సంబంధించిన వారు పాల్గొన్నారని భారత ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో భారత్ ప్రతీకారం మొదలుపెట్టింది.. లష్కరే ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, హిజుబుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద గ్రూపులు పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ గ్రూపులు మొత్తం తొమ్మిది స్థావరాలలో భద్రంగా ఉండి దాడులు చేస్తున్నాయి. అందువల్లే ఈ తొమ్మిది స్థావరాలను భారత రక్షణ విభాగం టార్గెట్ గా చేసుకుంది.
Also Read: భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు ఎలా చేయగలిగింది.. తెర వెనుక ఏం జరిగింది?
బహవల్పూర్ : జైష్ ఏ మహమ్మద్ ప్రధాన కార్యాలయం
పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో బాహవల్పూర్ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ అయినటువంటి జై మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. 2001 లో భారత పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా అటాక్ తో సహా భారత దేశంలో జరిగిన అనేక దాడుల వెనుక ఈ ఉగ్రవాద సంస్థ ఉంది.
మురిద్కే: లష్కర్ ఏ తోయిబా శిక్షణస్థలం
లాహోర్ నగరానికి ఉత్తరాన దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మురిద్కే.. లష్కర్ తోయిబా దాని అనుబంధం విభాగం జమాత్ ఉద్ దవా మురిద్కే ప్రాంతం స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించిన ప్రాంతంలో శిక్షణ, బోధన కేంద్రాలు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ లాజిస్టికల్ సపోర్ట్, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. 2008 ముంబై దాడులతో పాటు ఇతర దాడులను కూడా లష్కరే తోయిబా నిర్వహించిందని భారత్ ఆరోపిస్తోంది. 26/11 దాడులకు పాల్పడిన వారు ఇక్కడే శిక్షణ పొందారని భారత్ ఆరోపిస్తోంది.
కోట్లి: బాంబర్ శిక్షణ, ఉగ్రవాద ప్రయోగ స్థావరం
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని కోట్లి ప్రాంతం ఆత్మాహుతి దళాలు, తిరుగుబాటు ధరలకు ప్రధాన శిక్షణ కేంద్రంగా ఉంది.. ఇక్కడ నిత్యం 50 మందికి పైగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని తెలుస్తోంది.
గుల్పూర్: ఉగ్రవాద కార్యకలాపాలకు లాంచ్ ప్యాడ్ గా ఉంది..
2023, 2024లో జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి, పూంచ్ ప్రాంతంలో దాడులు చేసేందుకు లాంచ్ ప్యాడ్ గా గుల్పూర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు పదేపదే ఉపయోగించారు. ఈ ప్రాంతాలలో పౌరులపై దాడులు చేసి.. ఉగ్రవాదులు హతమార్చారు.
సవాయి: ఎల్ఈటీ శిబిరాలు..
ఉత్తర కాశ్మీర్లో.. ముఖ్యంగా సోన్ మార్గ్, గుల్మార్గ్, పహల్గాం ప్రాంతాలలో జరిగిన ఉగ్రవాద దాడులకు సవాయి ప్రాంతంలోనే లష్కరే ఏ తోయిబా ప్రణాళిక రూపొందించిందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
సర్జల్, బర్నాలా; చొరబాటు మార్గాలు
అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న సర్జల్, బర్నాలా ప్రాంతాలను ఉగ్రవాదులు చొరబాటుకు అనుకూలంగా పరిగణిస్తుంటారు.
మెహమూనా: హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూపుకు స్థావరం
సియాల్కోట్ సమీపంలో ఉన్న మెహమూనా ప్రాంతాన్ని హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూపు తమకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నది.. ఇక్కడి నుంచి ఉగ్రవాద సంస్థ తమ నెట్వర్క్ ను కొనసాగిస్తూ ఉంటుంది.
బుధవారం తెల్లవారుజామున..
ఈ తొమ్మిది ప్రాంతాలలో భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట 44 నిమిషాల నుంచి దాడి మొదలుపెట్టింది. లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ ఆయుధాలను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో దాడులు మొదలుపెట్టింది. 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ ఇది. పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ఈ దాడులు చేపట్టింది.
ఆ తొమ్మిది ప్రాంతాలు ఇవే
1.మర్కజ్ సుబాన్ అల్లా బహవల్పూర్ – JeM
2.మర్కజ్ తైబా, మురిద్కే -LeT
3.సర్జల్, టెహ్రా కలాన్ – JeM
4.మెహమూనా జోయా, సియాల్ కోట్ – HM
5.మర్కజ్ అహ్లే హదీత్, బర్నాలా – LeT
6.మర్కజ్ అబ్బాస్, కోట్లీ, హెచ్ ఎం షాహిద్స్ కోట్లీ – జేఎం
7.మస్కర్ రహీల్ షాహీద్- కోట్లీ
8.నల్లా క్యాంపు, ముజఫరాబాద్ – LeT
9.సయ్యద్ బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ – JeM.
Also Read: పాకిస్తాన్ పై భారత్ దాడి.. వీడియోలు వైరల్