Chhattisgarh Tribal Wedding Ceremony: ఛత్తీస్ గడ్.. ఈ రాష్ట్రం పేరు చెప్తే దట్టమైన అడవులు గుర్తుకొస్తాయి. అమాయకమైన ఆదివాసులు కళ్ళ ముందు కనిపిస్తారు. పచ్చని ప్రకృతి.. ఎత్తైన గుట్టలు.. దట్టమైన వృక్షాలతో అలరారుతూ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఈ రాష్ట్రంలో మావోయిస్టులు అధికంగా ఉంటారు. మొదటినుంచి కూడా ఈ ప్రాంతం వారికి అత్యంత సెక్యూర్డ్ షెల్టర్ గా ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతంలో మావోయిస్టులు అధికంగా ఉంటారు.
Also Read: ఇన్ని దారుణాలా? వాహ్ ఏం సమాజం రా బై ఇది
మావోయిస్టు కేంద్ర దళాలకు మొదటి నుంచి కూడా తెలుగువారే ప్రాతినిధ్యం వహిస్తుంటారు.. వారే ముందుండి నడిపించారు.. నడిపిస్తూనే ఉన్నారు.. అలాంటి చోట ఇప్పుడు మావోయిస్టులు తమ పట్టు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గడ్ లో అక్షరాస్యత తక్కువగా ఉంటుంది. పైగా దట్టమైన అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఇక్కడ సహజంగానే మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమాంతర పరిపాలన సాగిస్తుంటారు. సుక్మా, దంతెవాడ వంటి జిల్లాల్లో మావోయిస్టులు అధికంగా ఉంటారు.. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రం గానే ఉంటుంది.. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు కంచుకోటగా పువర్తి అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో గతంలో కేంద్ర బలగాలను మావోయిస్టులు అత్యంత దారుణంగా హతమార్చారు. మావోయిస్టులు ఈ గ్రామం కేంద్రంగానే అనేక రకాల ఎన్ కౌంటర్లకు పాల్పడ్డారు. ఈ గ్రామంలో ఒకప్పుడు అడుగుపెట్టాలంటే కేంద్ర బలగాలు సైతం భయపడేవి.. అంతేకాదు మావోయిస్టు కమాండర్ హిడ్మా ఇదే స్థావరంలో ఉండేవాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
కేంద్ర బలగాలు రావడంతో..
పువర్తి ప్రాంతంలోకి కేంద్ర బలగాలు రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 150 బెటాలియన్, సిఆర్పిఎఫ్ శిబిరాలు ఇక్కడ ఏర్పాటు కావడంతో ప్రజల్లో స్వేచ్ఛ పెరిగింది. దీంతో వారు తమదైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలోని ఆదివాసీ కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. ఆ వేడుకలో భాగంగా వధువును దగ్గర ఉన్న సిఆర్పిఎఫ్ శిబిరానికి ఆదివాసీలు తీసుకొచ్చారు. అయితే వారిని సిఆర్పిఎఫ్ బలగాలు సాదరంగా ఆహ్వానించాయి. ఆ తర్వాత నూతన వధువుకు కానుకలు ఇచ్చారు. బహుమతులు ఇచ్చి డ్యాన్సులు వేశారు.. గతంలో ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా ఉండటంతో ఆదివాసీలకు బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు. పైగా వారు ఒక రకమైన జీవితాన్ని గడిపేవారు. ఇక ఇటీవల కాలంలో అనేక మార్పులు వచ్చాయి. కేంద్రం ఆపరేషన్ పహార్ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇక్కడికి కేంద్ర బలగాలు రావడంతో మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారు. పువర్తి లాంటి ప్రాంతం మావోయిస్టుల నుంచి కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లిందంటే.. ఇక్కడ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల స్వేచ్ఛగా తమ దైనందిన జీవితాన్ని గడపడం.. వేడుకలను చేసుకోవడం వంటి సందర్భాలను చూస్తుంటే ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిందని అర్థమవుతుందని కేంద్రబలగాలు అంటున్నాయి.