spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి ఆ ఇద్దరు దర్శకులను పక్కన పెట్టడానికి కారణమేంటి..?

Chiranjeevi: చిరంజీవి ఆ ఇద్దరు దర్శకులను పక్కన పెట్టడానికి కారణమేంటి..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ సైతం ఇండస్ట్రీ లో తన కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చిరంజీవితో సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పటికప్పుడు చిరంజీవి పూరి జగన్నాథ్ ను పక్కన పెట్టేస్తున్నాడు. కారణం ఏంటి అంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం చిరంజీవికి ఇష్టం లేదా? లేద్నతే ఆయన చెప్పిన కథలు చిరంజీవికి నచ్చడం లేదా అనే కారణాలైతే వెలువడుతున్నాయి. నిజానికి చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ ని చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా పూరి జగన్నాథ్ కే దక్కింది… పూరి జగన్నాథ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?

అలాగే ఆయన హీరోయిన్స్ ను చాలా గ్లామరస్ గా చూపిస్తూ ఎక్స్పోజింగ్ కూడా చేయిస్తూ ఉంటాడు. దానివల్ల పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే చిరంజీవి ఇమేజ్ కి ఏమైనా ఇబ్బంది అవ్వచ్చనే ఉద్దేశంతో ఉన్నారట. అందువల్లే చిరంజీవి పూరి జగన్నాథ్ ను పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే హరీష్ శంకర్ సైతం గత కొన్ని రోజులుగా చిరంజీవితో సినిమా కోసం తెగ ట్రై చేస్తున్నాడు.

అయిన కూడా అతనికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఇక బాబీ లాంటి దర్శకుడికి మాత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల హరీష్ శంకర్ అలాగే అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్, హరీష్ శంకరు ఇద్దరిని చిరంజీవి ఎందుకని పక్కన పెడుతున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి…

నిజానికి హరీష్ శంకర్ కి గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ రాలేదు. దానివల్లే చిరంజీవి సైతం అతన్ని పక్కన పెట్టినట్టు గా తెలుస్తుంది. నిజానికి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేయడంలో హరీష్ శంకర్ కి చాలా మంచి గ్రిప్ ఉంది. అయినప్పటికి చిరంజీవి ఆయన్ని పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version