V Hanumantha Rao: వెనుకటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ పెద్ద సంసారం గాడి తప్పకుండా చూసేవారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అదుపులో ఉంచేవారు.. ఫలితంగా కుటుంబ సభ్యులు పద్ధతిగా ఉండేవారు. బంధాలను, బాంధవ్యాలను కాపాడుకునే దిశగా అడుగులు వేసేవారు. అందువల్లే భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలు గొప్పగా వెలుగొందాయి. మన కుటుంబాలను గొప్పగా చూడటం ప్రపంచం అలవాటు చేసుకుంది. ప్రపంచం కూడా అనేక సందర్భాలలో మన కుటుంబ వ్యవస్థల గురించి వివిధ వేదికల మీద అద్భుతంగా చెప్పడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు పూర్తిగా మారిపోతున్నాయి.. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. వ్యక్తిగత సుఖం కోసం.. ఇతర విలాసాల కోసం అడ్డమైన పనులు చేసే దిశగా పురి గొల్పుతున్నాయి. వీటివల్ల ఇటీవల కాలంలో కనివిని ఎరుగని స్థాయిలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: సర్ ప్రైజ్ : ట్యాప్ అవ్వని ఫోన్ వాడే ఆంధ్రజ్యోతి ఆర్కే కాల్స్ కేసీఆర్ విన్నాడట..
ఇటీవల నూతన జంట మేఘాలయ వెళ్ళింది.. వాళ్లది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం. వివాహం జరిగిన ఏడో రోజుల తర్వాత వారిద్దరూ హనీ మూన్ వెళ్లారు. అయితే అక్కడ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది. దీనికోసం తన ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హనీమూన్ పేరుతో మేఘాలయ దాకా తీసుకెళ్లిన ఆ యువతి చివరికి తన ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇప్పటికీ రోజుకో తీరుగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల చెందిన తేజేశ్వర్.. ఏపీలోని కర్నూలు జిల్లా చెందిన ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. అంతమందుకే ఐశ్వర్యతో తిరుమల రావు అనే బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉంది. అయితే తేజేశ్వర్ తమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో తిరుమల రావు సహాయంతో ఐశ్వర్య అతడిని అంతం చేయించింది. మూడు సార్లు తేజేశ్వర్ ను అంతం చేయడానికి ఐశ్వర్య ప్రణాళికలు రూపొందించింది. అవన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి నాలుగో ప్రయత్నంలో తేజేశ్వర్ ను అంతం చేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు ఇటీవల దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు మగవాళ్ళు ఈ దారుణాలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆడవాళ్లు మగవాళ్ళు మించిపోయారు. చివరికి ఘోరాలకు ప్రణాళికలు వారే రూపొందించడం.. సుఫారీలు కూడా వారే మాట్లాడటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు విలేకరుల ఎదుట ప్రస్తావించారు. ఇటువంటి సమాజం మంచిది కాదని.. దీని నివారణ కోసం అందరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. “ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తకు స్కెచ్ వేయడం ఏందిరా బై” అని వీ. హనుమంతరావు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తేటతల్లం చేస్తోంది.