Pawan Kalyan And Bandla Ganesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన విషయమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. జనసేన పార్టీని స్థాపించి రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆయనకి మొదట్లో కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. అయినప్పటికి భయపడకుండా ధైర్యం గా నిలబడి 2025 లో జరిగిన ఎనికల్లో తన పవర్ ఏంటో చూపించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక వీటితోపాటుగా సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ను జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముహూర్తం పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 25వ తేదీన ఓజి (OG) సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటే మాత్రం ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత చాలామంది తన సన్నిహితులను దూరం పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ఇన్ని దారుణాలా? వాహ్ ఏం సమాజం రా బై ఇది
నిజానికి బండ్ల గణేష్ అనే కమెడియన్ ను తీన్ మార్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మార్చింది పవన్ కళ్యాణ్ గారే అలాగే గబ్బర్ సింగ్ సినిమాతో అతన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ను చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే కావడం విశేషం. చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉండేది. బండ్ల గణేష్ సైతం పవన్ కళ్యాణ్ అభిమానిగానే కాకుండా తన భక్తుడిగా చెప్పుకుంటూ ఉంటాడు.
ఇక బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కాడు అంటే పవన్ కళ్యాణ్ జపం చేస్తూ ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సైతం బండ్ల గణేష్ స్పీడ్ చూస్తే ఆనందం కలుగుతుంది. కానీ బండ్ల గణేష్ ప్రతి సారి పవన్ కళ్యాణ్ గురించి ఓవర్ గా మాట్లాడుతుండటం చూసిన చాలా మందికి ఇది పవన్ కళ్యాణ్ కావాలనే ఆయన చేత మాట్లాడిస్తున్నాడని అనుకుంటారు.
దానివల్ల ఆయనకు బ్యాడ్ నేమ్ రావచ్చనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గణేష్ సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేయడం లేదు… వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ నుండి తప్పుకున్న శ్రీలీల..డైరెక్టర్ తో గొడవలే కారణమా?